వారెవ్వా..క్యా క‌మాల్ హై..!

దేశంలో త‌న‌కు ఎదురే లేకుండా చేసుకోవాల‌ని కేంద్రంలో కొలువు తీరిన క‌మ‌ల స‌ర్కార్‌కు, మోదీ, షా టీంకు కోలుకోలేని షాక్ ఇచ్చారు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్‌. భవిష్య‌త్‌లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని ప‌క్కా ప్లాన్‌తో బీజేపీ ముందుకెళుతోంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల‌లో కొలువు తీరిన ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ప్ర‌భుత్వాల‌ను కూల‌దోసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. అయితే దారికి తెచ్చు కోవ‌డం లేదా ఏదో ర‌కంగా ప‌వ‌ర్‌లోకి రావ‌డం. తాజాగా క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ ప‌డిపోయేందుకు ఎంత చేయాలో అంత చేసింది. షా క‌ర్నాట‌క‌లోకి ఎంట‌ర్ కావ‌డం..యెడ్డీ ప‌క్కా ప్లాన్ చేయ‌డంతో..మొత్తం స్కిప్టు పండింది. అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య విధాన‌స‌భ‌లో సంకీర్ణ స‌ర్కార్ విశ్వాస ప‌రీక్ష‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక పోయింది. బీజేపీ ఆడిన చ‌ద‌రంగంలో ప్ర‌భుత్వం కూలి పోయింది. ఇదే స్ట్రాట‌జీని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అమ‌లు చేయాల‌ని క‌మ‌లం భావించింది. ఆమేర‌కు అక్క‌డి సీఎం క‌మ‌ల్‌నాథ్‌కు చెక్ పెట్టాల‌ని చూసింది.

రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం క‌లిగి ఉన్న క‌మ‌ల్‌నాథ్ వీరి ప్లాన్‌ను , వ్యూహాల‌ను ముందే ప‌సిగట్టారు. త‌న స‌ర్కార్‌ను కూల్చే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్న బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. మోదీ, షాలు ఆదేశిస్తే చాలు ఒక్క రోజులో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుందంటూ ఆ రాష్ట్ర బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత గోపాల్ బార్గ‌వ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మాట్లాడిన కొద్ది గంట‌ల‌కే ..బీజేపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను సీఎం క‌మ‌ల్‌నాథ్ త‌న వైపు లాగేసుకున్నారు. ఇదే అంశంపై సీఎం ఘాటుగానే జవాబు ఇచ్చారు. అంతేకాకుండా క‌మ‌ల్‌నాథ్ స‌వాల్ విసిరారు. మీ నెంబ‌ర్ 1, 2 చాలా తెలివైన వాళ్లు. ప‌రిస్థితిని తెలుసుకోకుండా ఏమీ చెయ్య‌లేరు. ద‌మ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి. బ‌ల‌ప‌రీక్ష‌కు నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానంటూ స్ప‌ష్టం చేశారు. మా ఎమ్మెల్యేలు మీలాగా అమ్ముడు పోయే ర‌కం కాదంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సంకీర్ణ స‌ర్కార్ ఐదేళ్ల పాటు కొన‌సాగి తీరుతుందంటూ స్ప‌ష్టం చేశారు.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో సాధార‌ణ మెజారిటీకి 116 సీట్లు కావాల్సి ఉంది. మొత్తం శాస‌న‌స‌భ్యుల సంఖ్య 230. కాంగ్రెస్ కూట‌మికి 121 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లుండ‌గా, బీఎస్పీకి 2, ఎస్పీకి 1, ఇండిపెండెంట్లు 4 స‌భ్యులు ఉన్నారు. బీజేపీకి 109 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగ‌ర్ కావాలంటే ఇంకా 17 సీట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. దీంతో క‌ర్నాట‌క‌లో వ‌ర్క‌వుట్ కావ‌డంతో మోదీ, షా టీం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను టార్గెట్ చేశారు. ఆ మేర‌కు లోపాయికారీగా వ‌ర్క‌వుట్ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు నారాయ‌ణ్ త్రిపాఠి, శ‌ర‌ద్ కోల్‌ను కాంగ్రెస్ వైపు లాగేసుకున్నారు తెలివిగా క‌మ‌ల్‌నాథ్. మ‌ధ్య‌ప్ర‌దేశ్ విధాన‌స‌భ‌లో క్రిమిన‌ల్ లా చ‌ట్లానికి తెచ్చిన స‌వ‌ర‌ణ బిల్లుకు అనుకూలంగా వీరు ఓటు వేశారు. దీంతో బీజేపీ ఎంపీ విష‌యంలో తొంద‌ర‌పాటు ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. అయితే వేచి చూసే ధోర‌ణి ప్ర‌స్తుతానికి అవ‌లంభించినా..రాబోయే రోజుల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోను క‌మ‌ల్‌నాథ్‌ను కొన‌సాగించే ప్ర‌స‌క్తి లేద‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంతో బీజేపీ హైక‌మాండ్.

Comments

comments

Share this post

scroll to top