సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ రహస్యంగా ఉంచే విషయం ఏదైనా ఉంది అంటే తమ ప్రేమ విషయం,లేదంటే పెళ్లి విషయం.ముఖ్యంగా హీరోయిన్లు తాము ప్రేమలో ఉన్నమని,ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నామని చెప్పడానికి వెనకాడుతుంటారు..సాధారణంగా చెప్పరు..ఎప్పుడో మీడియా కంటపడితే మీడియా కోడై కూసినా కూడా దాన్ని ఖండించడం లాంటివి చేస్తారు..చివరాకరికి పెళ్లి అయితే వారి ప్రేమ నిజమేనని,వేరోకరితో ప్రేమాయణం స్టార్ట్ అయితే వీరి కథ బ్రేకప్ అయిందని మనమేం అర్దం చేసుకోవాలి..కానీ కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం వెరైటీగా ఉంది..తనెవర్ని ప్రేమిస్తున్నది..పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నది ధైర్యంగా చెప్పేసింది..
అఖిల్ హీరోగా నటించిన తన రెండవసినిమా హలో ద్వాారా హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.జున్ను క్యారెక్టర్ లో అందంతోనే కాదు అభినయంతో కూడా కల్యాణి మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కల్యాణి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకొన్న తర్వాత కల్యాణి భారీ కసరత్తే చేసింది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే ఆమె నాజుకుగా మారింది. అందంగా కనిపించడానికి దాదాపు 25 కిలోల బరువుతగ్గింది.హీరోయిన్ కావడం కన్నా ముందు ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసింది.
మలయాళంలో మోహన్ లాల్ నటన అంటే పడిచచ్చిపోయే కళ్యాణి. మోహన్ లాల్ సినిమాలను మిస్‌కాకుండా చూడటం కల్యాణికి అలవాటు. నిన్నటి తరంనటి లిజి ,దర్శకుడు ప్రియదర్శన్ ల కూతురే ఈ కళ్యాణి.. అమ్మతో నటించే అవకాశం వస్తే మాత్రం అసలే వదులుకోను అని అన్ని విషయాలను స్ట్రెయిట్ గా చెప్పే కళ్యాణి తన పెళ్లి గురించి కూడా కల్యాణి స్పష్టమైన అవగాహనతోనే ఉంది. 2022లో తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడుతానంటుంది ఈ ముద్దుగుమ్మ. చాలారోజులుగా ఫేస్బుక్లో ఫ్రెండ్‌గా ఉంటున్న రితుల్ బ్రూస్ లీని పెళ్లాడుతానని కల్యాణి చెబుతున్నది. అప్పటివరకు వారిద్దరూ ప్రేమలోనే ఉంటారట…