ఆమె పేరు కళ్యాణీ…చాలా సినిమాల్లో అనేక పాత్రలను పోషించింది. బాబీగా ఆమె చాలామందికి పరిచయం కూడానూ.. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగిన ప్రోగ్రామ్ లో …మీకు ఇంత టాలెంట్ ఉండి కూడా రావాల్సిన పేరు ఎందుకు రాలేదు.? అనే ప్రశ్న అడగగానే ఆమె తనలోని బాధను బయటపెట్టేసింది. వాస్తవానికి ఆమె చెప్పిన సమాధానాలు వింటే మనకు తెలియకుండానే మన కంట్లోనుండి నీళ్ళు వచ్చేస్తాయ్..
ఇండస్ట్రీలో ఆర్టిస్టులను తొక్కేసే ఆర్టిస్టులు ఉన్నారని ఆమె అన్నారు. ఓ పెద్ద కమెడీయన్ తనను తొక్కేశాడని అతని వల్లే తనకు 4 పెద్ద సినిమాల ఆఫర్లు పోయాయని కెమెరాల ముందు డైరెక్ట్ గా చెప్పేసిందామె. బయట ఆర్టిస్టులంటే ,ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులంటే చాలా చీప్ గా చూస్తున్నారని వాపోయింది. కనీసం రెంట్ కు ఇల్లు కూడా ఆర్టిస్టులకు దొరకడం లేదంటూ వాస్తవాన్ని కళ్ళముందుంచింది.
Watch Video: