శుభలేఖతోనే చెక్కు..! పెళ్లి రోజే చేతికి డబ్బులు..! అందరికి తెలిసేలా షేర్ చేయండి..!

ప్రభుత్వ పథకాలంటే అప్లై చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అంతకష్టపడి అప్లై చేసుకుంటే మనకొచ్చే లబ్ది చేతికందే వరకు అనుమానమే.అందుకే పేదవారికోసమే చేపట్టే ప్రభుత్వ పథకాలు  పేదవాడికి అందని ద్రాక్షలానే ఉంటాయి.అలాంటి పథకాల్లో భాగమే కళ్యాణలక్ష్మీ. కళ్యాణలక్ష్మీ,షాదిముబారక్ పేరిట పేదలకు సాయం చేయడానికి ముందుకొచ్చింది తెలంగాణా ప్రభుత్వం.ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడ్తున్న కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంపైన ఇటీవల అసెంబ్లీలో చర్చ జరగడంతో దీనిపై స్పందించారు మంత్రి జోగు రామన్న.. దీని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద లబ్ధిదారులకు పెళ్లి రోజే చెక్కులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు మంత్రి జోగురామన్న. గ్రామాల్లో లక్షన్నర ఆదాయం ఉన్న పేదలకు, పట్టణాల్లో రూ. 2 లక్షలు ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లకు ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి.ఇప్పటి వరకు 3.10 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. 2.90 లక్షల దరఖాస్తులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక నుంచి ఆలస్యం జరుగదని హామీ ఇచ్చారు. విచారణ సమయంలోనే చెక్కులు ఆలస్యమై ఉండవచ్చన్నారు. ఇక నుంచి అలా కాదని భరోసా ఇచ్చారు. పెళ్లి రోజే శుభలేఖతో పాటుగా చెక్కులు పంపిణీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Comments

comments

Share this post

scroll to top