Movie Title (చిత్రం): ఎం.ఎల్.ఎ (MLA)
Cast & Crew:
నటీనటులు: కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాశ్‌రెడ్డి, రవి కిషన్ తదితరులు
దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ (బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్)
Story:
ఓ సందర్భంలో కల్యాణ్(కల్యాణ్‌రామ్) ఇందు(కాజల్)ను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ఇందు.. కల్యాణ్ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇందు ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్. ఈ తరుణంలో ఇందుకి కల్యాణ్‌పై ప్రేమ పెరుగుతుంది. ఇందు నాన్న జయప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప(రవి కిషన్)బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. దాంతో ఇందును గాడప్పకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. అది విని ‘నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు’ అని కల్యాణ్‌తో చెప్తాడు జయప్రకాశ్. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎమ్మెల్యే అవుతానని చెప్పి కల్యాణ్.. గాడప్పతో ఛాలెంజ్ చేస్తాడు. మరి ఆ ఛాలెంజ్‌లో కల్యాణ్ ఎలా నెగ్గాడు? ఇందుని పెళ్లి చేసుకున్నాడా? అన్న విషయాలు తెరపై చూడాలి.
Review:
ఇదో కమర్షియల్ సినిమా. ప్రథమార్థంలో కథేమీ ఉండదు. కేవలం ఇందుని ఇంప్రెస్ చేయడానికి కల్యాణ్ పడే తాపత్రయం కనిపిస్తుంది. కల్యాణ పాత్రను మంచి లక్షణాలను అబ్బాయిగా చూపించడానికి తొలి సగాన్ని వాడుకున్నాడు దర్శకుడు. కబ్జా అయిన ఇందు ఆస్తిని తిరిగి రప్పించడానికి కల్యాణ్ వేసే ప్లాన్, దాన్ని అమలు పరిచే తీరు లాజిక్‌కి దూరంగా ఉన్నా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఆ ఎపిసోడ్లో దొరకుతుంది. ద్వితీయార్థం పూర్తిగా ఎమ్మెల్యే అవడానికి కల్యాణ్ చేసే ప్రయత్నం నుంచే మొదలవుతుంది. కమర్షియల్ విలువలతో పాటు చిన్న పిల్లలు చదువుకోవాలి తప్ప పనికి వెళ్ల కూడదు అనే మంచి పాయింట్‌ని చూపించాడు. ప్రతి సన్నివేశం ఊహకు అందుతూ సాగుతుంటుంది. కానీ వినోదం మాత్రం ఖాయం. చాలా సన్నివేశాలు లాజిక్కు దూరంగా ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాల్లో లాజిక్ పట్టించుకోకూడదు. అలా పట్టించుకోకపోతే ద్వితీయార్థం కూడా నచ్చుతుంది. పాటలు, ఫైట్లు పంచ్ డైలాగులు కమర్షియల్‌గానే సాగాయి. మొత్తంగా చూస్తే ఇది తెలిసిన కథే. కమర్షియల్ విలువలు జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు.
‘పటాస్’ నుంచి కల్యాణ్లోఈజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో అది కనిపిస్తుంది. వినోదం, భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. స్టైల్, దస్తులు కూడా కొత్తగా ఉన్నాయి. కాజల్ అందంగా కనిపించింది. తన పాత్రకీ ప్రాధాన్యం ఉంది. కానీ ద్వితీయార్థంలో కేవలం పాటలకే పరిమితమైంది. ‘రేసుగుర్రం’ తర్వాత రవికిషన్‌కి ఆ స్థాయి పాత్ర దక్కింది. విలన్‌గా మెప్పించాడు. తొలి సగంలో వెన్నెల కిశోర్ ద్వితీయార్థంలో పృథ్వీ వినోదాన్ని పంచుతారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు అతిగా అనిపిస్తాయి. మణిశర్మ అందించిన బాణీలు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. దర్శకుడికి ఇది తొలి సినిమా .కాబట్టి ప్రయోగాల జోలికి పోలేదు. కమర్షియల్ విలువలనే నమ్ముకున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి అంశాలు నచ్చుతాయో వాటిని మేళవించాడు.
Plus Points:
వినోదం
కమర్షియల్ అంశాలు
నిర్మాణ విలువలు
Minus Points:
రొటీన్ కథ
Final Verdict:
‘ఎం.ఎల్.ఎ’ మంచి కమర్షియల్ లక్షణాలు ఉన్న సినిమా
AP2TG Rating: 2.5 / 5
Trailer: