కళ్లు తెరవకుండానే ప్రపంచం చేత కన్నీళ్లు పెట్టించిన నలుగురు శిశువులు.#Heart_Touching.

తమ కంటితో ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచం చేత కన్నీళ్లు పెట్టించిన నలుగురు శిశువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… పెళ్లికి ముందు తొందరపడో, మతాల అడ్డుగోడల వల్లో, ఆరోగ్యం సహకరించలేదనో..ఏదో ఒక కారణం చేత కడుపులో ఎదుగుతున్న బిడ్డలు డాక్టర్ల  కత్తెర గాట్లకు  ముక్కలు ముక్కలు అవుతూనే ఉన్నారు. చట్టబద్దంగా కొన్ని చోట్ల, చట్ల వ్యతిరేఖంగా కొన్ని చోట్ల నెలలు నిండని పిల్లల్ని లోకాన్ని చూడకుండానే అనంతలోకాలకు పంపిస్తూనే ఉన్నాం….అయితే అలాంటి నలుగురు శిశువుల అసలు వ్యథే ఇది.
1) హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలిసిన ఓ యువతి తన గర్భాన్ని తొలగించుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్‌కు కూడా వెళ్లింది. అయితే అబార్షన్ చేసిన తరువాత తెలిసిందేమిటంటే బిడ్డ బతికే ఉందని. దీంతో బయటి ప్రపంచంలోకి వచ్చిన ఆ చిన్నారికి ఎలాంటి ప్రత్యేక వైద్యం అందించకుండానే ఒక కోల్డ్ స్టీల్ టబ్‌లో ఉంచారు. దీంతో హైపోథెర్మియా బారిన పడి ఆ చిన్నారి మృతి చెందాల్సి వచ్చింది.
1
2) గర్భంతో ఉన్న ఓ టీనేజర్ ఓ హాస్పిటల్‌కు అబార్షన్ కోసం వచ్చింది. అయితే అప్పటికే ఆమె కడుపులో ఉన్న శిశువుకు 15 వారాల వయస్సు ఉంది. ఈ క్రమంలోనే ఆ టీనేజర్‌కు అబార్షన్ చేసినా బిడ్డ బతికే బయటికి వచ్చింది. దీంతో ఆ చిన్నారిని స్టోరేజ్ రూంలో ఉంచాలని అక్కడి ఓ డాక్టరు నర్సుకు చెప్పాడు. కానీ ఆ నర్సు మాత్రం ఆ బిడ్డను బతికించాలనుకుని వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. కానీ ఎన్ని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లినా వారు బిడ్డను అడ్మిట్ చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ ముక్కు పచ్చలారని శిశువు చనిపోయింది.
6
3) అనుకోకుండా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిన ఓ మహిళ గర్భం నుంచి శిశువును బయటికి తీశారు. కాగా ఆ శిశువు బతికే ఉంది. దీంతో ఆ హాస్పిటల్ వైద్య సిబ్బంది సదరు శిశువును ఓ బకెట్‌లో పడేసి ఎలాంటి వైద్య సహాయం అందించకుండా అలాగే ఉంచారు. దీంతో ఆ శిశును ఈ భూ ప్రపంచాన్ని వీడాల్సి వచ్చింది.
3
4)  ఓ మహిళ గర్భం నుంచి 24 వారాల వయస్సున్న ఓ పిండాన్ని బలవంతంగా బయటికి తీశారు. అయితే ఆ శిశువు బతికే ఉంది. కానీ ఆ మహిళ తన మత ధర్మానికి విరుద్ధంగా తప్పుగా గర్భం ధరించిందని, ఆ శిశువు బతికి ఉండడానికి వీల్లేదని ఆమెకు అబార్షన్ చేసిన వైద్యులు ఆ శిశువుకు వైద్య సహాయం అందించలేదు. దీంతో ఆ శిశువు మృతి చెందింది.
4

Comments

comments

Share this post

scroll to top