కళ్ళముందు జరిగిన చిన్న ఇన్సిడెంట్…ఆ అమ్మాయి ప్రాణాలనే తీసుకుంది.

సినిమా చూసి ఇంటికెళుతున్న,  సమయం రాత్రి  9 దాటింది. చూసిన  సినిమాలోని టైటిల్ సాంగ్ ను హమ్ చేసుకుంటూ నా బైక్ మీద 40 స్పీడ్ లో వెళుతున్న…ఇంతలో ఓ అమ్మాయి స్కూటీ మీద రయ్ అంటూ నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్లింది. వైట్ యాక్టివాపై  వైట్ డ్రెస్ వేసుకొని ముఖానికి బ్లాక్  స్కార్ఫ్ కట్టుకొని ఉంది ఆ అమ్మాయి. అమ్మాయి నన్ను క్రాస్ చేసి అలా వెళ్లగానే నాలోని ఇగో నన్ను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది. అమ్మాయి స్కూటీ మీద నిన్ను క్రాస్ చేసింది. నువ్వేమో పల్సర్ వేసుకొని ఇంకా ముసళోల్లు నడిపినట్టు నడుపుతున్నావ్ అని….అంతే ఎక్స్ లేటర్ రేజ్ చేసా…నా బండి కూడా 70 వేగంతో దూసుకుపోతోంది.

ఆ వైట్ డ్రెస్  అమ్మాయి  నా కనుచూపుమేరలో ఉంది. ఆ అమ్మాయిని చూడగానే ఓ కుక్క అరుస్తూ ఆ అమ్మాయి వెంట పడుతుంది. ఆమె కూడా ఆ టెంక్షన్ లో కుక్కను తప్పించుకోవాలని ఇంకా ఎక్స్ లేేటర్ పెంచుతూనే ఉంది. నేను వెనుక నుండి ఆగిపో ఆగిపో…కుక్క ఏం అనదు.. స్కార్ఫ్ తీసేయ్.. అని అరుస్తూనే ఉన్నాను..అయినా ఆ అమ్మాయికి నా మాటలు వినబడలేదు… కుక్క వెంటపడుతుందని ఇంకా వేగంగా బండి నడుపుతుంది. ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇంత ఎత్తుకు ఎగిరింది బండి…ఇంకా కుక్క ఆమెను తరుముతూనే ఉంది. ఓ సారి కుక్క ను చూడడానికి వెనక్కు తిరిగింది ఆమె. కుక్క చాలా దగ్గర ఉంది…ఆ టైమ్ లో ముందు చూసుకోకుండా…. ఎక్స్ లేటర్ ఇచ్చింది. అంతే కంట్రోల్ తప్పిన యాక్టివా..ఎదురుగా ఉన్న గేట్ కు బలంగా గుద్దుకుంది. 70 స్పీడ్ లో ఐరన్ గేట్ కు గుద్దేసరికి తలపగిలి అక్కడే కుప్పకూలిపోయింది ఆ అమ్మాయి.

hqdefault

కుక్క ఆగిపోయింది. జనాలు గుమ్మిగూడారు. ఆ అమ్మాయి చనిపోయింది.

( సాధారణంగా కుక్కలు  కార్ల వెంట,  బైక్స్ వెంట పడుతుంటాయ్…కార్ అయితే డోర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్..కానీ బైక్ వాళ్లు ఇలా కుక్కులు వెంటపడ్డప్పుడు వెంటనే ఆగిపోవాలి. అలా ఆగినప్పుడు కుక్కలు కూడా ఆగిపోతాయి. కుక్కలు ఉన్న ప్లేస్ లలో స్లోగా వెళ్లాలి. మరో విషయం ఏంటంటే…ఈ అమ్మాయి రాత్రి టైమ్ లో స్కార్ఫ్ కట్టుకొని స్పీడ్ గా వెళ్లడం వల్ల కుక్క చాలా వరకు తరిమింది. ఆ సమయంలో ఆ అమ్మాయి బైక్ ను ఆపి ఉంటే…ఇంత ఘోరం జరిగేది కాదు.)

Comments

comments

Share this post

scroll to top