సిధ్దార్థ్ ,త్రిష, హన్సికలు కలిసి నటించిన కళావతి రివ్యూ & రేటింగ్ ( తెలుగులో)

Poster:
Siddharth-Kalavathi-Movie-Posters-3
Cast & Crew: 
నటీనటులు:సిద్దార్థ్,త్రిష, హన్సిక, సుందర్.సి. పూనమ్ బజ్వా, కోవైసరళ
దర్శకత్వం:  సుందర్.సి
సంగీతం:  హిప్ హాప్ తమీజా
నిర్మాత: గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
Story:
రామాపురంలో జమిందారు అయిన రాధారవి, ఆలయంలోని అమ్మవారిని పున:ప్రతిష్టించాలని నవధాన్యాలలో ఉంచుతారు. అలా చేయడం వల్ల అమ్మవారి శక్తి క్షీణించి, దుష్టశక్తులు బయటకు వస్తాయని అందరూ చెబుతారు. అలా ఒక దుష్ట శక్తి జమిందారు బంగ్లాలోకి ప్రవేశిస్తుంది. కోరికలు తీరకుండా,పగతో రగిలిపోతున్న ఆ దుష్టశక్తి కారణంగా జమిందారు కోమాలోకి వెళతాడు. ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీలో ఉన్న మురళి (సిద్దార్థ్), తనకు కాబోయే భార్య అనిత(త్రిష)ను తీసుకొని ఇంటికి వస్తాడు. జమిందారుకు సేవలు చేయడానికి కేరళ నుండి నర్స్ (పూనమ్ బజ్వా) ఇంటికి వస్తుంది. తమ బంగ్లాలో జరుగుతున్న పరిస్థితులను మురళి తెలుసుకునే ప్రయత్నంలో తనతో గొడవపడిన డ్రైవర్ హత్యకు గురవుతాడు. దీంతో మురళిని పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు. బంగ్లాలో జరుగుతున్న విషయాలను అనిత తన సోదరుడికి తెలుపడంతో రవి (సుందర్ సి) ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. బంగ్లాలో జరుగుతున్న రహస్యాలను తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన రవికి, అందులో కళ (హన్సిక) రూపం కనిపిస్తుంది. కళ మురళి సోదరి.ఆమె చనిపోయి చాల కాలం అయింది. కళావతి అనిత శరీరంలోకి ప్రవేశిస్తుంది. కళావతి దెయ్యంగా ఎందుకు మారింది. తన వాళ్ళపైనే ఎందుకు పగ సాధిస్తోంది. అనిత శరీరం నుండి మురళి ఆ  దుష్టశక్తిని ఎలా  విముక్తి చేశాడు అనేది మిగిలిన కథ.
PLUS POINTS:
  • త్రిష గ్లామర్ షో
  • హన్సిక 
  • సుందర్ సి
  • సెంథిల్ ఫోటోగ్రఫీ 
MINUS POINTS:
  • రొటీన్ స్టోరీ
  • స్లో నెరేషన్
  • పండని కామెడీ
  • సంగీతం
Verdict:  అక్కడక్కడ భయపెట్టే రొటీన్ హారర్ మూవీ ‘కళావతి’
Rating: 2.5 /5
Trailer:

Comments

comments

Share this post

scroll to top