కాలం నా ప్రేయసిలే…అంటూ AR రెహమాన్ పాట…చాలా రోజుల తర్వాత ఆయన పాట.

‘ కాలం నా ప్రేయసిలే..కలిసొచ్చే ఊర్వశిలే…మాయలే లేవు మంత్రాలే లేవు’ అంటూ సాగే ఈ పాట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ’24’ సినిమాలోనిది. ఇష్క్, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు విక్రం కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఈ పాటను చిత్ర ప్రమోషన్ లో భాగంగా విడుదల చేశారు.సూర్య త్రిపాభినయం చేస్తున్న ఈ చిత్రంలో సైంటిస్ట్, గ్యాంగ్ స్టర్ మరియు యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేఫధ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సైంటిస్ట్ దగ్గరకు వచ్చిన గ్యాంగ్ స్టర్ వాచ్ ఇవ్వమని కోరతాడు. మొత్తంగా ఈ చిత్రం కాలానికి సంబందించిన కథాంశంగా తెరకెక్కుతోంది.

తాజాగా రిలీజ్ అయిన పాటలో అదే విషయాన్ని చెప్పారు. కాలం నా ప్రేయసిలే అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ అందించిన సంగీతం వీనులవిందుగా ఉంది. రాక్ మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు రెహమాన్. రెహమాన్ తమిళ, తెలుగు చిత్రాలకు సంగీతం అందించి చాలారోజులయ్యింది. కాగా ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోoది. సూర్య సరసన సమంతా, నిత్యమీనన్ కథానాయికలుగా జతకడుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ మరియు 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని యువ హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేయనున్నాడు. మొదటి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ లేటెస్ట్ గా ఈ సాంగ్ తో ఉన్న అంచనాలను మరింత తారాస్థాయికి చేర్చారు చిత్ర యూనిట్. వేసవి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులన ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top