కలాం కు కన్నీటి వీడ్కోలు.. కంటతడి పెట్టించిన ఓ కవిత.

ఓ మహానీయుడికి తుది వీడ్కోలు పలకడానికి జనాలు బారులు తీరాలు, తమిళనాడు లోని రామేశ్వరం  అంతా జనసంద్రం అయ్యింది. ది ఇండియన్ మిసైల్ మ్యాన్ కు కన్నీటి వీడ్కోలు పలికింది సమస్త భారతావని. సైనిక లాంఛనాల మధ్య అబ్దుల్ కలాం అంత్యక్రియలు తన స్వగ్రామం రామేశ్వరంలో ముగిసాయి. సైనిక గౌరవ వందనంతో మహానీయుడికి  తుది వీడ్కోలు పలికింది భారత  సైన్యం.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోశయ్య లు హాజరయి.. కలాం  పార్దివ దేహానికి  నివాళులు అర్పించారు. కలాం గ్రామస్థులతో పాటు దేశం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కలాం అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

kalam_funeral_480

 

కలామ్ కవిత : కలయిక

(Courtesy: Afsar  గారి  వలస   కవితా సంపుటి  నుండి)
*
సోమరి సముద్రం
అలలతో నవ్వుతోంది
కొంగల బారు మబ్బుల మధ్య.
అయిదుపదుల వెనక్కి
జ్ఞాపకాలు పరుగుతీశాయి

నా చిన్నప్పటి రామేశ్వరం
నా రామస్వామీ నేనూ
అల్లుకున్న ప్రపంచం

మేమెవరిమో మాకు తెలీదు
నాకో మసీదూ అతనికో మందిరమూ
వున్నాయని తెలీదు
ఉదయకాంతి కిరణాలను
పంచుకోవడం తప్ప.

ఉన్నట్టుండి
వొక తుపాను ముంచెత్తింది
కొత్త టీచర్ మా మధ్య
ఓ గోడ కట్టాడు
అది అహంకారమో
ఆచారమో తెలీదు

నా ఏడ్పులు
రామస్వామి వెక్కిళ్ళు
కిటికిలోంచి వాలిన సూర్యకిరణాల నీడలో
మా కంటినీరు ముత్యమై మెరిసింది

కాలాలు గడిచాయి
స్నేహాలు మిగిలాయి
గతకాలాల శృతిలయల ధ్వని మాలో.

చదువుకున్న సర్పాలు
మా ఆత్మల మధ్య
విషరేఖలు గీస్తూనే వున్నాయి

అవి జ్ఞానాన్నివ్వలేదు
ద్వేషానిచ్చాయి
ఓటమినిచ్చాయి

ఆ పాఠాలు ఇక చెప్పకండి.
దేవుడికి ఈ తేడాలేవీ తెలియవని చెప్పండి.

(ఇది  కలాం రాసిన దానికి తెలుగు అనువాదం)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top