చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా ??వాటి సంకేతం ఏంటి???

కలలు కనడం మానవసహజం..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలోస్తాయి.కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వికులు చెప్తుంటారు..మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి..చెడు కలలకు అర్దం ఏంటి తెలుసుకోండి..

    • చనిపోయిన వారు కలలో వస్తే అర్దం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని ,వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం..మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో పాజిటిట్ థింకింగ్ కి అది సంకేతం.
    • మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వచ్చిందా మీ ఆత్మగౌరవం తగ్గుతుందనడానికి అది సూచన..అది మీలో అంతర్గత భయాన్ని సూచిస్తుంది.
    • పాములు కలలో వస్తున్నాయా..పాములను నిజంగా చూడడానికి కలలో చూడడానికి చాలా తేడా ఉంది.నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని అర్దం.

  • మన భాగస్వామి మనల్ని వదిలేసినట్టుగా లేదా మనకు దూరంగా పోయినట్టుగా కలలొస్తే మన రిలేషన్ షిప్ ఇన్ సెక్యూర్గా ఉందని,వాళ్లతో హ్యాపీ గా లేమని అర్దం.వాళ్లని వేరొకరి కి త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నామని అర్దం.
  • ఎగ్జామ్ మిస్ అయినట్టు,ఎగ్జామ్ ఫెయిలైనట్టు కలలోస్తే అది మన ఒత్తిడిని సూచిస్తుంది.ఇంట్లో వాళ్లు మనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన పడ్తున్నామని దానికి అర్ధం.
  • మీకు యాక్సిడెంట్ అయినట్టు,గాయపడినట్టు కలలోస్తే మీరు ఆత్మగౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి.మీ లైఫ్ బలహీనంగా ఉందని లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని తెలుపుతాయి.
  • చెడు కలలు వచ్చేవారు సృజనాత్మకత కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి.

 

Comments

comments

Share this post

scroll to top