అద్భుత వారసత్వం మట్టిపొరల్లోకి..కూలుతున్న కాకతీయుల నాటి కట్టడాలు.!

అద్భుతవారసత్వం మట్టిపొరల్లోకి..కూలుతున్న కాకతీయులనాటి కట్టడాలుశిథిలాల మాటేమిటి…!! దీపమైనా వెలుగని ఆనాటి ఆలయాపూన్నో.. నత్తనడకన ఆలయాల పునరుద్ధరణ దక్షిణ భారతదేశానికే తలమానికగా ఉన్న ఓరుగల్లు కాకతీయుల సామ్రాజ్యంలోని కాకతీయుల కట్టడాలు నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచాన్ని అబ్బురపరిచే శిల్ప కళా సంపద వైభవంతో, అద్భుత కట్టడాలతో ఒకప్పుడు తులతూగిన ఈ ప్రాంతంలోని ఆలయాలు ఇప్పుడు శిథిలమై దర్శనమిస్తున్నాయి.

ఈ దుస్థితికి కారణం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని స్పష్టమవుతుంది.  అడవులు, గుట్టలు, కొండలు, వాగులు ఎక్కడ చూసిన కాకతీయుల కళావైభవం కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగు చూడని వాటి సంగతి అటుంచితే. వెలుగులో ఉన్న ఆలయాలను పీకి పందిరేసి దశాబ్దాలు గుడుస్తున్న పునఃనిర్మించని దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి కట్టడాలకే ఈ ప్రభుత్వం కూల్చి కుదర కట్టలేకపోతుంది. ఆలయాలు పునరుద్దరణ నత్తనడకన సాగుతుండటంతో శిథిలావస్థలో ఉన్న ఎన్నో ఆలయాలు పునరుద్దరణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా తయారైంది.
రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో పాటు ప్రాంతీయ వివక్ష కారణంగా జిల్లాలోని అనేక ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని పునఃనిర్మిస్తామని పునరుద్దరణ పనుల కింద కేటాయించిన నిధులు బొక్కసంలోనే ముక్కిపోతున్నాయి.

గణపురం కోటగుళ్ళు
గణపేశ్వరాలయంగా ప్రసిద్ది చెందిన గణపురం కోటగళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రామప్ప ఆలయం కంటే అద్భుత శిల్ప కళలతో రాణి రుద్రమదేవి ఇష్టపడి జగకేసరి శిల్పాలను చెక్కించుకొని ఏర్పాటు చేసిన కోటగుళ్ళ పరిస్థితి దయనీయంగా తయారైంది. కోటగుళ్ళ పునరుద్దరణ కోసం పురావస్తు శాఖ పనులు ప్రారంభించిన అవి ముందుకు సాగడం లేదు.

12239720_859554170826242_147485616141842189_n

12274425_859553734159619_8690927119356196581_n

Comments

comments

Share this post

scroll to top