మనం ఈ 3 విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాం అంట..! అవేంటో తెలుసా..?

తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు… కడుపుతో ఉన్న స్త్రీ సంతోషంగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటుంది..తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది.. అందుకే కడుపుతో ఉన్నప్పుడు తల్లి నీతికథలు చదవడం,సంగీతం వినడం లాంటివి చేయాలి….తల్లి సంతోషంగా ఉండడానికి కుటుంబ సహాయం కూడా ఉండాలి..

తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు కొన్ని విషయాలు నేర్చుకుంటాడట.. అవేంటంటే

వినికిడి,శబ్దాలను గ్రహించడం,రుచిని తెలుసుకోవడం..ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు తెలుసుకుంటాడట… వెల్లుల్లిని తినడం లేదా తరిగిన గర్భిణులపై హెప్పర్ బృందం చేపట్టిన ఒక పరిశోదనలో వెల్లుల్లిని తీసుకున్ని తల్లులకు పుట్టిన పిల్లలు 7లేదా 8 ఏండ్లలోనే వెల్లుల్లి రుచిని ఆస్వాదిస్తున్నారట…క్యారెట్ తిన్న తల్లులకు పుట్టిన పిల్లలు 5,6నెలలకే క్యారెట్ రుచిని గుర్తిస్తున్నారని తెలిపారు.చాలావరకు పిల్లలు తీసుకునే ఆహారం వాళ్ల అమ్మ కడుపుతో ఉన్నప్పడు తీసుకునే ఆహారాన్ని ఇష్టంగా తినడం…వాళ్ల అమ్మ కడుపుతో  ఇష్టపడని ఆహారాన్ని పిల్లలు ఇష్టపడకపోవడం ఈసారి గమనించండి..

pregnant-lady

న్యూయర్క్ యూనివర్శిటీ కి చెందిన శాస్త్రవేత్త ,నవజాత శిశువులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మాటలను గుర్తించడం నేర్చుకుంటారని తెలిపారు..పరిసరాల్లో ధ్వని తగినంత లేకపోతే  పుట్టబోయే బిడ్డల్లో సంభాషణాలోపాలు ఏర్పడతాయి. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు బయట శబ్దాలకు లోపల కదలడం…పుట్టగానే తండ్రి మాటలని బట్టి గుర్తించడం మనం గమనిస్తాం …

 

Comments

comments

Share this post

scroll to top