భార్య ఆత్మహత్యపై స్పందించిన కబడ్డీ స్టార్ ప్లేయర్ రోహిత్.! Video.

PKL స్టార్ ప్లేయర్ రోహిత్ తన భార్య ఆత్మహత్యపై  స్పందించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో వీడియోను ఉంచాడు. తాను ఇంతవరకు ఒక్కసారి కూడా తన భార్యను కొట్టలేదని, చాలా బాగాచూసుకున్నానని, అధనపు కట్నాన్ని అడగాల్సిన అవసరం కూడా తమ ఫ్యామిలీకి లేదని కన్నీటిపర్యంతం అయి వివరించాడు. ఇదిలా ఉండగా….రెండు రోజుల క్రితం రోహిత్ భార్య లలిత …ఓ సూసైడ్ నోట్ రాసి మరీ ఉరి వేసుకొని చనిపోయింది. భ‌ర్త రోహిత్ చిల్లార్‌తోపాటు అత్త‌, మామ‌లు అద‌న‌పు క‌ట్నం కోసం ఆమెను నిత్యం వేధించేవారని,  రోహిత్ తనను త‌న ఇంటి నుంచి వెళ్లిపోమ‌ని, మ‌ళ్లీ ఢిల్లీకి రావ‌ద్ద‌ని చెప్పాడని సూసైడ్ నోట్ లో రాసింది లలిత.

3f497e05dd9b3ae73e5f570fa52facb8

త‌నను త‌న మెట్టినింటి వారు ఎంత‌గా వేధించారో స్వ‌యంగా త‌న మాటల్లోనే చెబుతూ ఓ ఆడియో మెసేజ్‌ను కూడా ఆమె రికార్డు చేసింది. ఈ రెండింటినీ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈమె ఆత్మహత్యపై స్పందించిన రోహిత్ పోలీసుల దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top