“కార్తీక దీపం” సీరియల్ లో కనిపించేది హీరోయిన్ అసలు రూపం కాదు..! రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా.?

సినిమా హీరోయిన్ అయినా,సీరియల్ హీరోయిన్ అయినా అసలెలా ఉండాలి..తెల్లటి తెలుపు, కోటేరుముక్కు, గులాభిపెదాలంటూ మనకు మనం  ఒక ప్రొఫైల్ పెట్టుకున్నాం..అసలు అమ్మాయిలు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నారు..నలుపు రంగుకి ప్రాధాన్యత తక్కువ అనేది అనేక సంధర్బాల్లో స్ఫష్టమయింది..ఇప్పుడు దానిపై కూడా వ్యతిరేకత వస్తుంది అది వేరే విషయం.నలుపుగా ఉన్న కళ ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు..తెల్లగా ఉన్నా వికారంగా కనపడే వారూ ఉన్నారు..నలుపుగా ఉన్నాకూడా తన నటనతో నవ్వుతో కట్టిపడేస్తుంది ప్రేమి విశ్వనాధ్..

watch video here:

స్టార్ మా లో కార్తీక దీపం అనే సీరియల్ వస్తుంది..బుల్లితెర హీరో నిరుపమ్ లీడ్ రోల్ పోషిస్తున్న సీరియల్లో ,అతడి సరసన ఇద్దరు నటీమణులు నటిస్తున్నారు..వారిలో ఒకరు ప్రేమి విశ్వనాధ్..మేనిఛాయ నలుపు అయినప్పటికీ ఆకట్టుకునే రూపం..నటన..వాస్తవానికి ప్రేమి శరీర రంగు నలుపు కాదు..ఆవిడేంటి అలా ఉంది..ఆమెని సీరియల్లోకి ఎలా తీసుకున్నారు అనుకుని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారికి ప్రేమి అసలైన ఫోటోలు షాక్ ఇస్తున్నాయి.చాలా అందంగా ఉంది..అయినప్పటికి కూడా తన అసలైన రూపం కాకుండా ఈ విధంగా నటించడానికి ప్రేమి ఒప్పుకోవడం విశేషమే.

ఇదే కథనంతో నాలుగేండ్ల క్రితం మళయాలంలో స్టార్ట్ అయిన సీరియల్ ద్వారా ప్రేమి స్మాల్ స్క్రీన్ కి పరిచయం అయింది.అక్కడ తన పాత్రతో సూపర్ డూపర్ హిట్ అయింది ప్రేమి.ఆ తర్వాత కొన్ని షోస్ కూడా చేసింది.ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.

ఇంతకు ముందు కాలేజ్ సినిమాలో కూడా లహరి అనే హీరోయిన్ని నలుపుగా చూపించారు.వసంత కోకిల అనే హిందీ డబ్బింగ్ సీరియళ్లో కూడా అందమైన హీరోయిన్ కి నలుపు రంగు పూసి చూపించారు.అలాకాకుండా నలుపుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందేమో…

Comments

comments

Share this post

scroll to top