కాలుతో రుద్దిన ఆ స్టార్ హీరో చెంప పగలకొట్టిన “రాధికా ఆప్టే”..! ఇంతకీ ఆ హీరో ఎవరు.?

ఎప్పుడూ ఏదోఒక విషయంతో సంచలనంగా మారే రాధికా ఆప్టే.. తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలోని ఓ హీరోపై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న ఓ టాక్‌ షో కు ముఖ్య అతిధిగా వచ్చిన రాధికా ఆప్టే.. తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘‘దక్షిణాదిలో నా మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు మొదటిరోజే ఓ స్టార్ హీరో నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అప్పటిదాకా కనీసం పరిచయం కూడా లేని ఆ హీరో.. సెట్స్‌లో నా పక్కన కూర్చొని అసభ్యంగా కాలుతో రుద్దాడు. వెంటనే కోపంతో అతని చెంప చెళ్లుమనిపించా..’’ అంటూ సదురు హీరోపై సంచలన ఆరోపణలు చేసింది రాధికా. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లొంగదీసుకుంటున్నారని పలువురు హీరోయిన్స్ నోరువిప్పుతున్న తాజా తరుణంలో రాధికా ఆప్టే చెప్పిన ఈ విషయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన రాధికకు తెలుగులో ‘‘లెజండ్, లయన్, రక్త చరిత్ర’’ లాంటి సినిమాలు, తమిళంలో ‘కబాలి’ సినిమా చెప్పుకోదగ్గ సినిమాలు.

Comments

comments

Share this post

scroll to top