హెయిర్ ఫాల్ సమస్య ఉంటే నిజంగా ఎవరికైనా చిరాకు వేస్తుంది. ఎక్కువగా రాలిపోయే జుట్టును రక్షించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. షాంపూలు వాడుతారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్‌ను రాస్తారు. ఇంకా కొందరు మరింత ముందుకు వెళ్లి డాక్టర్లను కూడా కలుస్తారు. అయినప్పటికీ హెయిర్ ఫాల్ ఆగకపోతే..? మరింత ఎక్కువైతే..? అప్పుడు ఏమవుతుంది..? అలాంటి సమయాల్లో ఎవరైనా ఏం చేస్తారో తెలియదు కానీ.. ఆ యువకుడు మాత్రం తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతని పేరు ఆర్.మిథున్ రాజ్. వయస్సు 27 సంవత్సరాలు. మదురై వాసి. బెంగుళూరులో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలం కిందట సొంత ఊరైన మదురై వచ్చాడు. అక్కడి జైహింద్ పురంలో నివాసం ఉండే అతని తల్లి అయిన వసంతి వద్ద మిథున్ ఉంటున్నాడు. అయితే మిథున్ ఉద్యోగం చేయకుండా తన తల్లి వద్దే ఉండేందుకు ఓ కారణం ఉంది. అదే.. హెయిర్‌ఫాల్.. మిథున్‌కు తీవ్రమైన హెయిర్‌ఫాల్ సమస్య ఉండేది. దీంతో అతను తల్లి వద్దకు వచ్చి ఉంటున్నాడు. అక్కడే స్థానికంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే మిథున్ తన హెయిర్ ఫాల్ సమస్య నిమిత్తం ఎంతో మంది వైద్యులను కలిశాడు. కానీ వారు మిథున్ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఎందుకంటే మిథున్ కు చర్మ సమస్య ఉంది. అది కూడా తలలో. దీంతో జుట్టు రాలుతుందని వైద్యులు నిర్దారించారు. కానీ ఆ సమస్యను వారు సాల్వ్ చేయలేకపోయారు. దీంతో మిథున్ తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యాడు. తన తల్లి ఆలయానికి వెళ్లినప్పుడు అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది. మిథున్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఇలాంటి స్థితి మరొకరికి రాకూడదు కదా..!