బాబోయ్!… “జూనియర్ ఎన్టీఆర్” ఇలా అయిపోయాడేంటి?…ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే సినిమా సినిమాకు వ్యతాసం చూపడంకి ఫేమస్. “టెంపర్” లో నటవిశ్వరూపం చూపించి అభిమానుల ప్రశంసలు అందుకోవడమే కాదు ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. తరవాత వచ్చిన “జనతా గ్యారేజ్” తో అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసాడు తారక్. “నాన్నకు ప్రేమతో” సినిమాతో కూడా ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయాడు. “టెంపర్”, “నాన్నకు ప్రేమతో”, “జనతా గ్యారేజ్”. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను అందించే పనిలో బిజీగా ఉన్నాడు.

బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ అనే సినిమాలో నటిస్తున్నాడు  ఎన్టీయార్‌.. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఇందులో ఒకటి విలన్‌ పాత్ర కూడా ఉంది. ఆ నెగిటివ్‌ రోల్‌కు సంబంధించి ఎన్టీయార్‌ గెటప్‌ ఇటీవలే లీక్ అయ్యింది. ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాకు పనిచేసిన మేకప్‌మేన్‌ వాన్స్‌ గార్ట్‌వెల్‌ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఆయనే ఎన్టీయార్‌ పోషించబోయే విలన్‌ పాత్ర కోసం ఓ మాస్క్‌ను రూపొందించాడట. చూడడానికే భయంకరంగా ఉన్నాడు ఈ మాస్క్‌లో ఎన్టీయార్‌. ఇక సినిమాలో ఎలా నటించనున్నాడో చూడాలి!

Comments

comments

Share this post

scroll to top