జ్యూస్ తయారీ కంపెనీలో దిమ్మతిరిగే దృశ్యాలు… అక్కడ తయారైన జ్యూస్‌ను తాగితే ఇక అంతే సంగతులు..!

జ్యూస్‌లంటే మీకిష్టమా? జ్యూస్ సెంటర్ల వద్ద లేదా బాటిల్స్‌లో అందిస్తున్న పండ్ల రసాలను ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే జ్యూస్ సెంటర్ల వద్ద మీ కళ్ల ఎదుటే జ్యూస్‌ను తయారు చేసి ఇస్తారు కాబట్టి, అది పరిశుభ్రంగా ఉంటేనే మీరు తాగుతారు. మరి బాటిల్స్‌లో లభిస్తున్న జ్యూస్‌ల మాటేమిటి..? అవి ఎంత పరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేశారో మీకు తెలుసా? తెలీదు కదా! మరి వాటిని నమ్మి మీరు ఆయా జ్యూస్‌లను ఎలా తాగుతున్నారు? ఏంటి భయంగా ఉందా? అవును, ఉంటుంది. ఎందుకంటే నేడు అధిక శాతం జ్యూస్ తయారీ కంపెనీల్లో పరిశుభ్రత కొరవడుతుందని తెలుస్తోంది.

juice company

juice company

ఈజిప్టులో ఓ జ్యూస్ తయారీ కంపెనీపై పోలీసులు దాడులు చేయగా, వారికి అక్కడ దిమ్మ తిరిగేలా పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాల మూటలు, చిందర వందరగా పడి ఉన్న వస్తువులు, పరిశుభ్ర లేని ఫ్లోర్, గోడలు, స్వచ్ఛంగా లేని నీరు, బాటిల్స్‌ను శుభ్రపరచడంలో లోపించిన కొరత, తయారీ యంత్రాల్లో పేరుకుపోయిన పాత జ్యూస్ నిల్వలు… ఇలా ఒక్కటేమిటి, ఆ జ్యూస్ తయారీ కంపెనీలో అన్ని చోట్లా పరిశుభ్రత లోపించింది.

juice company

juice company

ఈ క్రమంలో ఆ కంపెనీకి వెళ్లిన పోలీసులకు పైన తెలిపిన దృశ్యాలు కనిపించి వారిని అవి అవాక్కయ్యేలా చేశాయి. దీంతో వెంటనే పోలీసులు ఆ కంపెనీని సీజ్ చేశారు. పరిశుభ్రత లోపించిన కారణంగా ఆ జ్యూస్ కంపెనీని వారు మూయించారు. అయితే ఇది ఈజిప్టులోనే కదా, ఇక్కడ అలా ఉండదు లెండి, అని మీరు అనుకోవచ్చు. కానీ దాదాపు అన్ని జ్యూస్ తయారీ కంపెనీల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయట.

juice company

juice company

నిత్యం ఎక్కడో ఒక చోట వినియోగదారులు జ్యూస్ బాటిల్స్‌ను కొనుగోలు చేసి తాగేందుకు సిద్ధమవడం, వాటిలో ఏదో ఒకటి రావడం, దాని గురించి మీడియాలో కూడా వస్తుండడం… ఈ తతంగాన్నంతా మనం గమనిస్తూనే ఉంటాం. అయినా వాటి గురించి అంతగా పట్టించుకోం. ఏదో ఒక చోట ఇలాగే ఏ జ్యూసో, కూల్‌డ్రింకో తాగడం అది పడక అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడం జరుగుతుంది. ఈ క్రమంలో అలాంటి కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసిన జ్యూస్‌లను, డ్రింక్‌లను తాగే బదులు సహజ సిద్ధంగా లభించే వాటిపై దృష్టి పెట్టడం బెటర్. దీంతో మన ఆరోగ్యం కూడా సేఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఇక ముందు ఏదైనా జ్యూస్ లేదా డ్రింక్‌ను తాగే ముందు ఒకసారి ఆలోచించండేం!

Comments

comments

Share this post

scroll to top