15 యేళ్ళ వయస్సులో Jr.NTR ఇచ్చిన స్టేజ్ ఫర్పార్మెన్స్ ఇది. అప్పుడే ఇరగదీశాడు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా తన సినిమాలతో నందమూరి అభిమానులను అలరిస్తున్నాడు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే. చిన్నప్పుడే కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నాడు తారక్. కళ్ళు చెదిరే స్టెప్పులతో, శరీరాన్ని విల్లులా తిప్పుతూ డ్యాన్సులు అధ్బుతంగా వేయగలడు తారక్. కళ్ళతో హావభావాలు పలికిస్తూ డ్యాన్సులలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని చెప్పడానికి ఈ వీడియో ఓ ఉదాహరణ.  తనకు  15 ఏళ్ళ వయసున్నప్పుడు అంటే 1997 లో గుంటూరులో స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు జూనియర్. ఈ స్టేజ్ పై ఎన్టీఆర్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. పిట్టకొంచెం కూతఘనం అన్నట్లుగా దాదాపు అరగంటపైగా నృత్యం చేసి, తనకు నాట్యం అంటే ఎంతిష్టమో, నాట్యం చేస్తున్నప్పుడు హావభావాలను ఎలా పలికించాలో చూపాడు. . ఆనాటి వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా,ప్రస్తుతం వైరల్ గా మారింది తారక్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో.

Watch Video ( Wait 3 Sec For Video To Load):

 

#RareVideo1997 Jr NTR Classical Dance Performance in Guntur ^_^- Nenu Naa NTR

Posted by Nenu Naa NTR on Wednesday, November 25, 2015

Comments

comments

Share this post

scroll to top