అభిమానులకు యంగ్ టైగర్ గిఫ్ట్!!!

కామన్ గా బర్త్ డే బాయ్ కు మనం గిఫ్ట్స్ ఇస్తుంటాం … బట్ ఈ సారి చిన్న ఎన్టీఆర్ తన అభిమానులకు తనే ఓ పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు . ఆ గిఫ్ట్ కోసం మాత్రం అయన బర్త్ డే, మే 20 వరకు ఆగాల్సిందే.
అసలేంటి ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటున్నారా ???అభయ్ రామ్ రూపురేఖలు…..

అభయ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి ల ముద్దుల కొడుకు..ఇప్పటి వరకు అభయ్ రామ్ కు సంభందించిన ఏ ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా యంగ్ టైగర్ చాల కష్టపడ్డారు.

Jr-NTR---Lakshmi-Pranathi

 

స్టార్ల బర్త్‌డేలకు మాములుగా వారు నటిస్తున్న చిత్రాల ఫస్ట్‌లుక్‌లు, సినిమా ప్రారంభోత్సవాలు  చేసి అభిమానులను అలరిస్తారు.. కానీ ఎన్టీఆర్ తన పుట్టినరోజునాడు (మే20) అధికారికంగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో కొడుకు అభయ్ రామ్ ఫోటోలను విడుదల చేయాలనుకుంటున్నాడట. ఇది నందమూరి అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త అని చెప్పొచ్చు. టెంపర్‌ సక్సెస్‌తో జోరుమీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘మా నాన్నకు ప్రేమతో’ అనే సినిమా కోసం రెడీ అవుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top