మీ పిల్లలకు ఈ పౌడర్ నే వాడుతున్నారా? అయితే క్యాన్సర్ కు దగ్గర్లో ఉన్నట్టే!?

చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ లో ప్రాణాంతక క్యాన్సర్ కారకాలున్నాయా? అంటే అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి. ఈ పౌడర్ ను వాడినందుకు ఓ మహిళ తాను అండాశయ క్యాన్సర్ కు గురయ్యానని అమెరికా కోర్ట్ లో పిర్యాదు  చేయగా…. సదరు మహిళకు  460 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ పౌడర్ సంస్థకు నోటీసులు జారీ చేసిందంట అమెరికన్ కోర్ట్…అంతేకాదు…జాన్సన్ అండ్ జాన్సన్, షవర్ టు షవర్ ప్రొడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలున్నాయని….అమెరికా కోర్ట్స్ లో నే  దాదాపు 1700 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.

మనదగ్గర  ఫ్యాషన్ మరీ ముదిరిపోయింది…చిన్నపిల్లలకు స్నానం చేయించింది మొదలు….పుట్టినప్పడి నుండే అనేక క్రీమ్ లు, లోషన్స్ ను పూసేస్తున్నారు. అందంగా కనిపించాలని, కలర్ రావాలని, పిల్లల నుండి సువాసనలు రావాలని…ఇలా మార్కెట్ లో కొత్తగా ఏది కనబడితే ఆ క్రీమ్ లను పిల్లలకు పూసేస్తున్నారు. వీటి గాఢతకు పెద్దలు తట్టుకోవడమే కష్టం, అలాంటిది పిల్లలపై అంతంత ప్రభావపూరిత క్రీమ్ లు , లోషన్లు అవసరమా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.!?

మన సాంప్రదాయ బద్దమైన సున్నిపిండిని పక్కకు పెట్టి….పేరు కూడా తెలియని క్రీమ్ లు, సబ్బులతో స్నానాలు అవసరమా? ఓ సారి ఆలోచింద్దాం….. కాస్మోటిక్స్ పేరుతో పిల్లల అరోగ్యాలను, మన డబ్బును వృథాగా తగలేసే ప్రయత్నాలు మానుకుందాం.!

Comments

comments

Share this post

scroll to top