ఎనిమిదో తరగతి అర్హతతో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా( F.C.I) లో ఉద్యోగాలు.

నిరుద్యోగులకు శుభవార్త..అది కూడా పెద్దపెద్ద చదువులు అక్కర్లేదు.కేవలం ఎనిమిదో తరగతి పాసై ఉంటే చాలు.పరిస్థితులు అనుకూలించక లేదంటే మరే ఇతర కారణాల చేతనైన చదువు మానేసిన వారు త్వరపడండి.ఇప్పుడున్న పరిస్థితుల్లో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్నవారు చాలా తక్కువ.ఏదో ఒక ఉద్యోగం తప్పదు అనుకునే పరిస్థితి.ఏది ఏమైనా హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ లోని FCI కార్యాలయాల్లో 271 వాచ్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.ఆ వివరాలు తెలుసుకోండి ఉద్యోగానికి అప్లై చేసుకోండి.

 

మొత్తం వాచ్ మెన్ ఖాళీలు: 271 (అన్ రిజర్వుడ్..138, ఓబీసీ..73, ఎస్సీ..41, ఎస్టీ..19)

ప్రాంతాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్..158, తెలంగాణ..101, అండమాన్ నికోబార్..12

వేతనం: రూ.8,100-18,070

విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి: 2017, జూలై నాటికి 18-25 ఏళ్ళ లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్..పీఈటీ( దేహ దారుఢ్య పరీక్ష)

దృష్టి సామర్థ్యం: అభ్యర్థులకు FCI నిబంధనలను అనుసరించి తగిన దృష్టి సామర్థ్యం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250, ఎస్సీ/ఎస్టీలకు, మహిళ, దివ్యాంగ, ఎక్స్..సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2017

వెబ్ సైట్…www.fciregionaljobs.com

Comments

comments

Share this post

scroll to top