ఉరి వేసుకోవ‌డం కూడా ఎలాగో తెలియ‌ట్లేదు. ఎంత ట్రై చేసినా చావు రావ‌ట్లేదంటూ…సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ‌తి.!

త‌న‌కు టీచ‌ర్ జాబ్ రాద‌ని ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. త‌న పేరెంట్స్ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ టీచ‌ర్ కావాల‌న్న ఉద్దేశ్యంతో 5 సంవ‌త్స‌రాలుగా ప్రిపేర్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే నిర్వ‌హించిన TRT ఎగ్జామ్ లో …. OMR షీట్ లో ఆన్స‌ర్ బ‌బ్లింగ్ చేసే క్ర‌మంలో వ‌రుస త‌ప్పి అన్ని రాంగ్ గా చేసిన‌ట్టు త‌న సూసైడ్ నోట్ లో చెప్పింది. జీవితంలో టీచ‌ర్ ఉద్యోగం త‌ప్ప మారేదాన్ని ఊహించుకోలేను ఇప్పుడు నేను చేసిన త‌ప్పు వ‌ల్ల నేను కోరుకున్న లైఫ్ నాకు ద‌క్క‌ట్లేదంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది సుప్రియ‌.

  • 5 సంవ‌త్స‌రాలు సెల్ ఫోన్ కూడా ఉప‌యోగించ‌కుండా ప్రిపేర్ అవుతున్నాను.
  • ఉరి వేసుకోవ‌డం కూడా ఎలాగో తెలియ‌ట్లేదు. ఎంత ట్రై చేసినా చావు రావ‌ట్లేదు.
  • నాకంటే చిన్న వాళ్లు పెళ్ళి చేసుకున్నా, నా లైఫ్ నెక్ట్స్ ఉంది అనుకున్నాను, బ‌ట్ ఇప్పుడు నాకు ప్యూచ‌ర్ లేదు.
    నాకు నేను శిక్ష వేసుకుంటున్నా.

అంటూ సూసైడ్ నోట్ లో సుప్రియ రాసిన మాట‌లు క‌లిచివేస్తున్నాయి. ఉద్యోగం లేక‌పోతే జీవిత‌మే లేద‌న్న‌ట్టూ చిత్రీక‌రించే ఈ స‌మాజపు దృష్టికోణం మారాలి. మంచి లైఫ్ ను లీడ్ చేసేందుకు ప్ర‌పంచంలో ల‌క్ష‌ల మార్గాలున్నాయ‌ని తెలిసేలా చేయాలి. అప్పుడు కానీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కావు.

Comments

comments

Share this post

scroll to top