ఆ నీచుడు మేనేజర్ ని అని నమ్మించి జాబ్ ఇస్తానని ఎలా చాట్ చేసాడో చూడండి.! ఆమె తెలివిగా ఏం చేసిందంటే.?

నేటి తరుణంలో ఉద్యోగం సంపాదించడం అనేది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. నిరుద్యోగ యువతీ యువకులు తాము కోరుకున్న జాబ్‌ సంపాదించడం కోసం చెమటోడుస్తున్నారు. కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎన్నో ఇంటర్వ్యూలను అటెండ్‌ చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక కారణం వల్ల చాలా మంది జాబ్‌ పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి వారిలో ప్రధానంగా యువతులు మోసగాళ్ల బారిన పడుతున్నారు. వారిని మోసగాళ్లు అనేకంటే నిజానికి మృగాళ్లు అనడమే బెటర్‌. అంతగా వాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగ యువతులు ఉద్యోగం అంటూ వస్తే చాలు.. అదే ఆసరగా చేసుకుని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. బెంగుళూరులో తాజాగా ఓ యువతికి కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఉద్యోగం ఉందని చెప్పి ఆమెను ఓ కామాంధుడు ఆకర్షించాడు. కానీ ఆమె అతని బారి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. దీంతో ఆ వ్యక్తికి చెందిన బండారం మొత్తం బట్టబయలు కాగా ప్రస్తుతం అతను జైలులో ఊచలు లెక్కబెతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

బెంగుళూరుకు చెందిన నమ్య బెయిద్‌ అనే యువతి ఎయిర్‌లైన్స్‌ కంపెనీలో ఫ్లైట్‌ అటెండెంట్‌ ఉద్యోగం కోసం పలు జాబ్‌ సైట్లలో రెజ్యూమ్‌ను పెట్టుకుంది. అయితే మార్చి 27వ తేదీన ఆమెకు దీపురాజ్‌ అనే వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. అతను తనను తాను ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ మేనేజర్ గా పరిచయం చేసుకున్నాడు. దీంతో నమ్య అది నిజమేనని నమ్మింది. ఈ క్రమంలో దీపురాజ్‌ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. మొదటి మూడు రౌండ్లు పూర్తయ్యాయి. అనంతరం ఓ రౌండ్‌ అతను ఆమెను వీడియో ఇంటర్వ్యూ చేశాడు.

అయితే వీడియో ఇంటర్వ్యూలో దీపురాజ్‌ ఆమెను పలు భంగిమల్లో నిలబడమన్నాడు. దీంతో నమ్యకు అనుమానం వచ్చింది. అయినా చేసేది ఫ్లైట్‌ అటెండెంట్‌ జాబ్‌ కనుక అందంగా ఉండాలని, చక్కని ఫిజిక్‌ ఉన్న యువతులు కావాలని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు కోరుకుంటాయి కనుక అతను అలా నిలబడమని అంటున్నాడు కాబోలునని ఆమె అనుకుంది. కానీ ఇక చివరి రౌండ్‌కు వచ్చేసరికి ఆమెకు అసలు విషయం తెలిసింది. నిజానికి చివరి రౌండ్‌ అసలు ఇంటర్వ్యూనే కాదు. అది సెక్స్‌ చాట్‌ రౌండ్‌. దీపురాజ్‌ నమ్యను తనతో వాట్సాప్‌లో సెక్స్‌ చాట్‌ చేయమన్నాడు. అయితే నమ్య దానికి ఓకే చెప్పి అతనితో చేసిన వాట్సాప్‌ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను బయట పెట్టింది. వాటిని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడమే కాదు, వాటితో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు దీపురాజ్‌ను అరెస్ట్‌ చేశారు.

అయితే దీపురాజ్‌ కేవలం నమ్యను మాత్రమే కాదు, గతంలో చాలా మంది యువతులతో ఇలాగే చేశాడట. వారితో వీడియో ఇంటర్వ్యూ అని చెప్పి వారి వీడియోలను రికార్డ్‌ చేసి, తనతో వాట్సాప్‌లో సెక్స్‌ చాట్‌ చేయాలని, లేదంటే ఆ వీడియోలను బయట పెడతానని బెదిరించాడట. దీంతో ఆ యువతులు అతను చెప్పిన పనికి అంగీకరించారు. అయితే నమ్య మాత్రం ధైర్యం చేసి అతనిపై ఫిర్యాదు చేసింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టు అతని గురించిన బండారం మొత్తం బయట పడింది. అసలు దీపురాజ్‌ నిజానికి ఎయిర్‌లైన్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కాదు, యువతులతో అలా ప్రవర్తించేందుకే మేనేజర్‌ అవతారం ఎత్తాడు. జాబ్‌ సైట్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ పెట్టుకున్న యువతుల వివరాలను అక్రమంగా సేకరించి వారితో పైన చెప్పిన విధంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో నమ్య అనే యువతి ధైర్యం చేయడంతో చివరకు ఈ అయ్యగారి బండారం ఇలా బయటపడింది. ఏది ఏమైనా యువతులు మాత్రం ఇలాంటి ఫ్రాడ్‌గాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!

Comments

comments

Share this post

scroll to top