ఫేస్బుక్ లో పరిచయం..ఉద్యోగం అడిగితె రూమ్ కి రమ్మని.. కూల్ డ్రింక్ లో ….చివరికి ఏమైంది?

ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి జాబ్ ఇప్పిస్తానంటే ఆమె గుడ్డిగా అత‌ని మాటలు న‌మ్మింది. ఇంకేముందీ… వెంట‌నే అత‌ను చెప్పిన ప్ర‌దేశానికి వెళ్లింది. మొద‌ట్నుంచీ ఆమెపై కన్నేసిన అత‌ను ఆమె తాగిన కూల్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపాడు. ఇంటి వ‌ద్ద దిగ‌బెడ‌తాన‌ని చెప్పి కారులో ఎక్కించుకుని అత్యాచారం చేశాడు. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో..! స‌ద‌రు దుండ‌గుడి అత్యాచారానికి బాధితురాలు ఇప్పుడు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతుండ‌గా, నిందితుడిని ప‌ట్టుకునే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

ఢిల్లీలో నివాసం ఉండే ఓ యువ‌తి (25)కి సోను సింగ్ అనే వ్య‌క్తితో గ‌త కొంత కాలం క్రితం ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయింది. అయితే ఆ యువ‌తికి ఉద్యోగం దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ఎక్క‌డా ఉద్యోగం ల‌భించ‌క‌పోవ‌డంతో చివ‌రికి ఆమె సోను సింగ్‌ను ఉద్యోగం ఇప్పించ‌మ‌ని రిక్వెస్ట్ చేసింది. దీంతో అత‌ను స‌రే అన్నాడు. అందులో భాగంగానే మాట్లాడ‌దాం అని చెప్పి స‌ద‌రు యువ‌తిని సోను సింగ్ హోట‌ల్ కు ర‌మ్మ‌న్నాడు. ఆమె గ‌త నెల 26వ తేదీన ఢిల్లీలో ఉన్న ప్రెస్ ఎన్ క్లేవ్ రోడ్‌లోని సెలెక్ట్ సిటీ మాల్ వ‌ద్ద ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌కు వెళ్లింది.

హోట‌ల్‌లో ఆ యువ‌తి సోను సింగ్‌ను క‌లుసుకుంది. దీంతో ఇద్దరూ లంచ్ చేశారు. ఈ క్ర‌మంలో అత‌ను కూల్‌డ్రింక్స్ కూడా తెప్పించాడు. అయితే మొద‌ట్నుంచీ ఆమెపై క‌న్నేసిన సోను సింగ్ ఆమె తాగే కూల్‌డ్రింక్‌లో ఆమెకు తెలియ‌కుండా మ‌త్తు మందు క‌లిపాడు. దీంతో ఆ కూల్‌డ్రింక్‌ను తాగిన ఆ యువ‌తి మ‌త్తు ప్ర‌భావానికి లోనైంది. దీంతో ఆమెను ఇంటి వ‌ద్ద దింపుతాన‌ని సోను సింగ్ చెప్పి హోట‌ల్‌లో సెల్లార్‌లో ఉన్న త‌న కారు దగ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. అనంత‌రం స్పృహ‌లో లేని ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో కొంత సేప‌టికి స్పృహ‌లోకి వ‌చ్చిన ఆ యువ‌తి జ‌రిగింది తెలుసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలో వారు ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించి నిందితుడి కోసం గాలిస్తున్నారు..! చూశారుగా… ఫేస్‌బుక్ ఎంత‌టి ప‌నిచేసిందో. అందుకే తెలియ‌ని వ్య‌క్తుల‌తో అందులో పరిచ‌యం కాకూడ‌దు అని చెప్పేది. అందునా మ‌హిళ‌లు అయితే ఇంకా జాగ్రత్త‌గా ఉండాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top