ఇంటర్వ్యూ లో జాబ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా.? 100 ఇస్తే ఏం చేస్తావ్ అనే ప్రశ్నకు బదులిచ్చిన అతడికి ఉద్యోగం వరించింది

చదువు అయిపోగానే ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు, ఇంక చదువు తరువాత నెక్స్ట్ అంటే చాలా మంది చేసేది జాబ్ ఏ, కానీ జాబ్ కి అటెండ్ అవ్వాలి అంటే ఎన్నో ఇంటర్వ్యూ లు, ఎన్నో కంపెనీ లు. కంపెనీ లకు ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవుతాం, ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాకపోతే తిరిగి ఇంకో కంపెనీ ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతాం. ఇలా అంతా తల నొప్పి ఎవ్వారం.  కానీ ఇంటర్వ్యూ లలో చలాకీగా ఆన్సర్ చెప్పి ఉద్యోగం సంపాదించి ఉండటం చూసి ఉండరు, వివరాల్లోకెళితే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు తనకి ఎదురైనా సంఘటన ఇది.

నీ గురుంచి చెప్పమని ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తిని అడిగాడు ఇంటర్వ్యూయర్

అతను తన గురుంచి మొత్తం చెబుతాడు, ఆ తరువాత ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్న కి ఇంటర్వ్యూ కి వచ్చిన వ్యక్తి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

ఇంటర్వ్యూయర్:

నీకు 100 రూపాయిలు ఇస్తే నువ్వు ఎం చేస్తావ్.

 బాయ్:

ఒక .ఈ.డి బల్బ్ కొంటాను .

ఇంటర్వ్యూయర్:

ఎల్.ఈ.డి బల్బ్ ఆ.? బల్బ్ ఎందుకు కొంటావు

 బాయ్:

ఈ రూమ్ లో ఒక బల్బ్ హోల్డర్ లో బల్బ్ లేదు, కనుక ఆ బల్బ్ ని ఈ బల్బ్ హోల్డర్ లో పెడతాను.

ఆ ఇంటర్వ్యూయర్ అతని వైపు చూసి ఒక చిరు నవ్వు నవ్వి అతనికి ఉద్యోగం ఇస్తాడు. ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం లో పరిసరాల్ని కూడా అంత తక్కువ సమయం లో గమనించడం ఒక పాయింట్ అయితే, ఈ సమాధానం సిల్లీ గ ఉందని కూడా ఆలోచించకుండా చెప్పి ఉద్యోగం సంపాదించాడు ఆ యువకుడు.

ఇలా ప్రతి ఇంటర్వ్యూ లో చాక చక్యంగా సమాధానం చెబితే సరిపోద్ది అనుకోకండి, కొన్నిటికి మాత్రమే ఇలా చాక చక్యంగా సమాధానం చెప్పాలి. అయితే మన దెగ్గర టాలెంట్ ఉంటె మనకు జాబ్ పక్కా వస్తాది, కానీ టాలెంట్ తో పాటు లౌక్యం కూడా ఉండాలి, మనిషికి పనితనానికి లౌక్యం తోడైతే ఆ వ్యక్తికి తిరుగుండదు.

 

Comments

comments

Share this post

scroll to top