మీరు జియో క‌స్ట‌మ‌రా..? అయితే ఈ లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌..!

”మీరు రిల‌య‌న్స్ జియో వినియోగ‌దారులా..! అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే..! ఈ మెసేజ్‌లోని లింక్ క్లిక్ చేసి అందులో చెప్పిన విధంగా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మీకు ఇంట‌ర్నెట్ డేటా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఉన్న 1 జీబీ డేటా లిమిట్ కాస్తా ఎగిరిపోయి ఏకంగా మీకు 10 జీబీ వ‌ర‌కు ఇంట‌ర్నెట్ డేటా వ‌స్తుంది..!” ఇదీ… ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ మెసేజ్‌. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌… ఇలా ఏ సామాజిక మాధ్య‌మం తీసుకున్నా వాటిల్లో జియో ఇంట‌ర్నెట్ డేటా గురించిన ఈ మెసేజ్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే ఇలాంటి మెసేజ్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌..! ఎందుకంటే వాటిలో చాలా వ‌ర‌కు ఫేక్ లింక్స్ ఉంటున్నాయ‌ట‌.

jio-fake-message

పైన చెప్పిన విధంగా మెసేజ్ వ‌స్తే చాలా మంది యూజ‌ర్లు ఆ మెసేజ్‌ను ఓపెన్ చేసి అందులో ఉండే లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. సాధార‌ణంగా అలాంటి లింక్‌లు http://upgrade-jio4g.ml/ పేరిట అచ్చం జియో వెబ్‌సైట్‌కు చెందిన లింక్‌ల మాదిరిగానే ఉంటున్నాయి. దీంతో నిజంగానే ఆఫ‌ర్ వ‌స్తుంది క‌దా, 10 జీబీ డేటా ల‌భిస్తుంది క‌దా అని చెప్పి చాలా మంది ఆ లింక్‌ల‌ను ఓపెన్ చేస్తున్నారు. అలా చేయ‌గానే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారు. అన్ని వివరాలు రాబట్టిన తర్వాత ఇక రెండో స్టెప్‌లో ‘‘మీ వాట్సప్ గ్రూప్‌లోని మిగతా ఫ్రెండ్స్ కూడా జియో సేవలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు గ్రూప్‌లోని మిగతా ఫ్రెండ్స్‌తో కూడా దీన్ని షేర్ చేసుకోండి’’ అని అడుగుతారు. లేదా ‘‘ జియో సర్వీసును అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మీరు కనీసం పది మంది ప్రెండ్స్‌కి దీన్ని షేర్ చేయాలి’’ అని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో యూజ‌ర్ అలా చేయ‌గానే స‌ద‌రు మెసేజ్ అత‌ని ఫ్రెండ్స్‌కు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ అవుతోంది. కానీ నిజంగా డేటా ల‌భించ‌డం లేదు. దీనికి తోడు అలా మెసేజ్ షేర్ అవ‌డం వ‌ల్ల ప‌ది మంది… ప‌ది మంది… ఇంకాస్త ఎక్కువై ఆ లింక్‌ను ఓపెన్ చేస్తున్న వారి సంఖ్య చాంతాడ‌వుతోంది. ఫ‌లితంగా ఎంతో విలువైన వ్య‌క్తిగ‌త స‌మాచారం హ్యాక‌ర్ల బారిన ప‌డ‌డ‌మే కాదు, బ్యాంకింగ్ వివ‌రాలు తెలుస్తుండ‌డంతో సైబ‌ర్ నేరాలు కూడా జ‌రుగుతున్నాయి. క‌నుక మీకు అలాంటి మెసేజ్‌లు క‌నిపిస్తే వాటిని ఓపెన్ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. ఎంతైనా మ‌న సేఫ్టీ ముఖ్యం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top