యూజ‌ర్ల‌కు 1000 జీబీ వ‌ర‌కు ఫ్రీ డేటా ఇవ్వ‌నున్న JIO. #వాడుకున్నోడికి వాడుకున్నంత‌!

ఉచిత 4జీ డేటా, కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు వంటి బంప‌ర్ ఆఫ‌ర్ల‌తో రిల‌యన్స్ జియో మార్కెట్‌లో ఎంత‌టి సంచల‌నాలు సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. రోజుకు 1జీబీ వ‌ర‌కు ఉచిత 4జీ డేటా వాడుకునే వీలును ఇప్ప‌టి వ‌ర‌కు జియో క‌ల్పించింది. అయితే ఇక‌పై బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ రంగంలోనూ జియో వెల్లువ‌లా దూసుకు రానుంది. గ‌తంలో ఇందుకు సంబంధించిన వార్త‌లు వ‌చ్చినా, జియో దాన్ని ధృవీక‌రించ‌లేదు. కానీ తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం… జియో బ్రాడ్‌బ్యాండ్ అరంగేట్రం చేసేందుకు మ‌రెన్నో రోజులు ప‌ట్ట‌ద‌ని చూచాయ‌గా తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ తాజాగా చేస్తున్న ప్ర‌యోగాలే కార‌ణం.

jio-broadband-2

ముంబై, పూణెల్లో జియో త‌న బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ఇప్ప‌టికే ప‌లువురు వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. ఈ క్ర‌మంలో వారు నెల‌కు 100 జీబీ వ‌ర‌కు డేటాను పొందుతున్నారు. వారికి 1 జీబీపీఎస్ వ‌ర‌కు గరిష్ట స్పీడ్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో జియోను వాడుతున్న యూజ‌ర్లు త‌మ‌కు వ‌స్తున్న నెట్ స్పీడ్ గురించి ప‌లు ఇమేజ్‌ల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అవి ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. దీంతో జియో బ్రాడ్‌బ్యాండ్ గురించిన విష‌యాలు మ‌ళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో జియో బ్రాడ్‌బ్యాండ్ త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు కూడా.

అయితే మొబైల్ నెట్‌వ‌ర్క్ రంగంలో ఉచిత 4జీ డేటాతో ఆరంభంలోనే అద‌ర‌గొట్టిన జియో, బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌లోనూ అలాగే దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తుంద‌ట‌. అందుకే ఆరంభ ఆఫ‌ర్‌గా మొద‌ట 3 నెల‌ల పాటు యూజ‌ర్ల‌కు ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వ‌నుంద‌ట‌. ఆ స‌మయంలో యూజ‌ర్లు నెల‌కు 100 జీబీ వ‌ర‌కు డేటాను డౌన్‌లోడ్‌, అప్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ట‌. ఇక 3 నెల‌లు అయ్యాక ఏదో ఒక ప్లాన్‌ను యూజ‌ర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో 1 జీబీపీఎస్ స్పీడ్‌కు గాను నెల‌కు 100 జీబీ మొద‌లు కొని 10 జీబీపీఎస్ స్పీడ్‌కు నెల‌కు 1000 జీబీ వ‌ర‌కు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ డేటాను ఇచ్చేందుకు జియో సిద్ధ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే ఇప్ప‌టికే మార్కెట్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్న ప‌లు ఐఎస్‌పీలు చ‌తికిల ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక జియో బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top