జియో ఫోన్స్ కు పెద్ద బ్రేక్: అందులో లేని ఎన్నో ఫీచర్స్ తో పోటీగా “ఐడియా” సరికొత్త ఫోన్లు..! పొందాలంటే ఇలా..?

జియో..టెలికాం రంగంలో ఒక సంచలనం..జియో ఇచ్చిన ఆఫర్ల దెబ్బకి మిగతా టెలికం కంపెనీలు కుదేలయ్యాయి..ఇప్పుడు జియో ఫోన్ల తాకిడిని తట్టుకునేందుకు..జియో  ఎఫెక్ట్ నుండి కోలుకోవడానికి ఐడియా సెల్యులార్ 4జి హ్యాండ్ సెట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

ఫీచర్ ఫోన్ ను సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి తెస్తామని జియో ప్రకటించిన కొన్ని రోజులకే ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. జియో హ్యాండ్ సెట్లలో కొన్ని యాప్స్ మాత్రమే పనిచేస్తాయని, నెటిజన్లకు కీలక అవరసరమైన వాట్సాప్ లాంటి కొన్ని ఫీచర్లు తమ హ్యాండ్ సెట్లలో అందుబాటులోకి రానున్నాయని ఫోన్ ధర దాదాపు రూ.2500 వరకు ఉంటుందని ఐడియా ప్రకటించింది..‘అందరికీ నెట్ అందుబాటులోకి తెస్తూ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ఐడియా వినియోగదారులకు అన్ని యాప్స్ అందిస్తుందట.. జియో మాత్రం వినియోగదారులను ఆకర్షించే హ్యాండ్ సెట్ తీసుకొస్తామని ప్రకటించినా.. అందులో అన్ని యాప్స్ వాడే సౌకర్యం లేదు. ఐడియా విడుదల చేయనున్న హ్యాండ్ సెట్లలో ఈ సమస్యలు ఉండవు.మనకు నచ్చిన వాట్సప్,ఫేస్ బుక్ మరియు ఇతర యాప్స్ కూడా వాడుకోవచ్చట.. జియో ఫోన్లలో జియోనే ఆపరేటర్ గా ఉంటుంది. కానీ ఐడియా హ్యాండ్ సెట్లలో ఇతర టెలికాం ఆపరేటర్ ను ఎంచుకునే ఆప్షన్ ఉందట…చూడాలి జియోపోటీని ఐడియా ఎంతవరకు తట్టుకుంటుందో..ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో…

Comments

comments

Share this post

scroll to top