జియో పానీ పూరీ.. రూ.100 చెల్లిస్తే ఎంతైనా తినొచ్చ‌ట‌. ఎక్క‌డో తెలుసా..?

అపరిమిత ఇంట‌ర్నెట్‌, కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు… వంటి ఆఫ‌ర్ల‌తో రిల‌య‌న్స్ జియో దేశంలోని మొబైల్ యూజ‌ర్ల‌ను ఏ విధంగా ఆకర్షించిందో అంద‌రికీ తెలిసిందే. జియో దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థి సంస్థ‌ల‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి. దీంతో అవి కూడా ఆఫ‌ర్ల‌ను అందివ్వ‌క త‌ప్ప‌లేదు. అవును మ‌రి, ఏం చేస్తారు. ఇది అస‌లే పోటీ యుగం క‌దా. ప్ర‌తి దాంట్లోనూ పోటీయే. మ‌రి ఆ మాత్రం పోటీ త‌ట్టుకోలేక‌పోతే ఎలా..? మార్కెట్‌లో వెనుక‌బ‌డి పోరూ..! అవును కాబ‌ట్టే… ఆ చిరు వ్యాపారి కూడా స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకున్నాడు. అందుక‌నే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌కు వినూత్న‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. ఇంత‌కీ అదేంటో తెలుసా..?

అత‌ని పేరు ర‌వి జ‌గ‌దాంబ‌. ఉంటున్న‌ది గుజ‌రాత్‌లోని పోరు బంద‌ర్‌. ఇత‌నిది పానీ పూరీ వ్యాపారం. దానిపైనే ఆధార ప‌డి జీవిస్తున్నాడు. పానీ పూరీ అమ్మ‌గా వచ్చే డ‌బ్బు తోనే అత‌ను కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ర‌వి వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్ర‌మంలో అత‌ను తాజాగా ఓ ఆలోచ‌న చేశాడు. వెంట‌నే ఆ ఐడియాను అమ‌లులో పెట్టేశాడు. ఇంత‌కీ ఆ ఐడియా ఏంటంటే… రిల‌య‌న్స్‌కు చెందిన జియో ఆఫ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తున్నాయి క‌దా. వాటిని చూసే ర‌వికి ఓ ఆలోచ‌న వ‌చ్చింది. తాను కూడా త‌న ద‌గ్గర పానీ పూరీ కోసం వ‌చ్చే వారికి జియో ప్లాన్ మాదిరిగా రూ.100 చెల్లించి అప‌రిమిత పానీ పూరీ తినేలా ఆఫ‌ర్ పెట్టాడు.

రూ.100 చెల్లిస్తే చాలు త‌న వ‌ద్ద ఎవ‌రైనా ఎంతైనా పానీ పూరీ తిన‌వ‌చ్చ‌ని అంటున్నాడు. అదే నెల మొత్తానికి ఎంతైనా తినాలంటే ఒకేసారి రూ.1వేయి చెల్లించాల‌ని బోర్డు పెట్టాడు. దీంతో అత‌ని బిజినెస్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అంత‌కు ముందు క‌న్నా ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన జియో పానీ పూరీ ఆఫ‌ర్‌తో అత‌ని వ్యాపారం రెట్టింపు లాభంతో జ‌రుగుతుంద‌ట‌. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే ఇత‌నే కాదు, గ‌తంలోనూ క‌రీంన‌గ‌ర్ కు చెందిన కొంద‌రు రైస్ మిల్ల‌ర్లు జియో రైస్ అంటూ వ్యాపారం మొద‌లు పెట్టి అంద‌రినీ ఆకర్షించారు. చూస్తే పోతే… ఇంకా ఎంద‌రు ఇలా జియో ఆఫ‌ర్‌ను వాడుకుంటారో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top