“రిలయన్స్ జియో” మరో సంచలన ఆఫర్ లు..! కొత్తగా అప్ డేట్ అయిన ప్లాన్స్ ఏంటో తెలుసా..?

మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి.  అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా, కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తో ముందుకొచ్చారు..!

19 రూపాయల నుంచి 9999 రూపాయల వరకు ప్లాన్స్ ను పెంచింది. 19, 49, 96, 149, 309, 509, 999, 1999, 4999, 9999 ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ 309, 509, 999 ఉన్నాయి. రూ.303, రూ.499 ప్లాన్స్ ను రూ.309, రూ.509తో రీప్లేస్ చేసింది.

  • 19 రూపాయల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది. నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఎంబీ డేటాను పొందనున్నారు.
  • రూ.49, రూ.96, రూ.149 రీఛార్జ్ ప్యాక్ లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.
  • తొలిసారి రూ.1999 రీఛార్జ్ చేయించుకున్నవారికి రోజంతా 185జీబీ 4జీ డేటాను అందించనుంది. తర్వాతి నుంచి 125జీబీ 4జీ డేటాను అందించనుంది. ఇది 150 రోజుల ప్లాన్.
  • రూ. 4999 రీఛార్జ్ చేసుకుంటే.. తొలిసారి .. 410 జీబీ 4జీడేటా… తర్వాతి నుంచి 350జీబీ 240 రోజులు అందించనుంది.
  • రూ.9999 రీఛార్జ్ చేసుకుంటే మొదట 810 జీబీ 4జీ డేటా.. తర్వాతి నుంచి 750జీబీ… 420 రోజులు పొందవచ్చు.
  • పోస్టు పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీఛార్జ్ మూడు నెలల వరకు 90జీబీ డేటాను పొందనున్నారు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. మూడు నెలల వరకు ఈ అవకాశం ఉంది. ఆ తర్వాతి రీఛార్జ్ లకు నెలకు 30జీబీ మాత్రమే పొందవచ్చు.
  • 509 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ తో అయితే 180జీబీ 4జీ డేటాను మూడు నెలల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2జీబీను యూజర్లు పొందుతారు. తర్వాతి రీఛార్జ్ కు నెలకు 60జీబీ మాత్రమే పొందుతారు.
  • 999 రూపాయల రీఛార్జ్ తో కూడా 180జీబీ డేటానే పొందవచ్చు. కానీ డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఫస్ట్ రీఛార్జ్ తర్వాత రీఛార్జ్ లపై 60జీబీ డేటాను నెలపాటు పొందుతారు.

Comments

comments

Share this post

scroll to top