మరో సంచలన ఆఫర్ ప్రకటించిన “జియో”..! ఆఫర్ పొందాలంటే ఏం చేయాలో చూడండి..!

మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి.  అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా, కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు మరొక ఆఫర్ తో ముందుకి వచ్చారు..!

501 రూపాయలకు ఇంటర్నేషనల్ కాల్స్ కేవలం 3 రూపాయలు నిమిషానికి:

అమెరికా, ఇంగ్లండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమవారికి ఇండియా నుంచి కేవలం నిమిషానికి 3రూపాయలు చెల్లించి కాల్స్ చేసుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు.

 

  • 501 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే సర్వీస్ యాక్టివేషన్‌తో పాటు పూర్తి మొత్తంలో (501) బ్యాలెన్స్ కూడా పొందొచ్చు.
  • ఆ 501 రూపాయల నుంచే ఇంటర్నేషనల్ కాల్ రేట్స్‌ను తగ్గిస్తామని రిలయన్స్ జియో యాజమాన్యం తెలిపింది.

పైన ప్రకటించిన దేశాలతో పాటు అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, హాంకాంగ్, ఇటలీ, మంగోలియా, మొరాకో, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్, రొమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్ దేశాలకు కూడా నిమిషానికి 3 రూపాయలు చెల్లించి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని జియో తెలిపింది. అయితే అర్జెంటినా, డెన్మార్క్, ఇస్రాయెల్, జపాన్, పాకిస్థాన్, సౌత్ కొరియా దేశాల్లో ఉన్న వారికి ఇండియా నుంచి కాల్ చేస్తే రూ. 4.8 పైసలు చార్జ్ చేస్తామని రిలయన్స్ జియో స్పష్టం చేసింది.

Comments

comments

Share this post

scroll to top