మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి. అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా, కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు మరొక ఆఫర్ తో ముందుకి వచ్చారు..!
ఉచితంగా 168 జిబి ఫ్రీ 4g డేటా :
“వివో జియో క్రికెట్ మానియా ఆఫర్” పేరిట ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది రిలయన్స్ “జియో”. జియో “వివో” తో కలిసి ఈ ఆఫర్ ను ప్రకటించింది. కొత్త “వివో” ఫోన్ కొన్నవారు, లేదా ఇదివరకునుండే “వివో” ఫోన్ వాడుతున్నవారు ఈ ఆఫర్ పొందటానికి అర్హులు. ఉచితంగా 168 జిబి ఫ్రీ 4g డేటా పొందొచ్చు.
ఆఫర్ పొందటం ఎలా..?
- కొత్త “వివో” ఫోన్ కొన్నవారు మరియు మునపటినుండే “వివో” ఫోన్ వాడుతూ “జియో” సిమ్ వినియోగిస్తున్నవారు..ముందుగా “క్రికెట్ మానియా ఆఫర్” లో రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్ట్రేషన్ సమయంలో “ఫేవరెట్ టీం” సెలెక్ట్ చేసి “జియో” నెంబర్ నుండి మెసేజ్ పంపించాలి.
- వాళ్ళు సెలెక్ట్ చేసిన టీం గెలిచిన ప్రతి సారి ఉచిత డేటా వస్తుంది
- సెలెక్ట్ చేసిన టీం గెలుస్తే 3gb డేటా. ఓడిపోతే 1gb డేటా. డ్రా అయితే 2gb డేటా.
- ఇలా 168 జీబీ వరకు డేటా పొందొచ్చు