“మంచిర్యాల” కలెక్టర్ గా “దీపికా పడుకొనే” అంట.? ఫేస్బుక్ లో రాసిన దానికి, అసలు కథకి ఎంత తేడానో చూడండి!

సోషల్ మీడియా పుణ్యమాని పబ్లిసిటి రాని వార్తంటూ లేదు..కాని సోషల్ మీడియాలో వచ్చేవన్ని నిజాలని కాదు..బతికున్నవారిని చంపేసిన ఘటనలు ఉన్నాయి…నేను బతికే ఉన్నాను రా బాబు అంటూ సదరు వ్యక్తి మొత్తుకున్న సంధర్బాలు ఉన్నాయి..లేని వాటిని సృష్టించడం ,దానికి అపారమైన పబ్లిసిటి తెచ్చిపెట్టడం సోషల్ మీడియాలో ఒక భాగమే.అందులో భాగంగానే  ఇటీవల ఇబ్బడిముబ్బడిగా వైరలైన వార్త…మంచిర్యాల కలెక్టర్ గా బాద్యతలు చేపట్టిన దీపికా పదుకొనే… మీరు చదివింది నిజమే…ఈ దీపికా పదుకొనే మరెవరో కాదు మన బాలివుడ్ హీరోయిన్ దీపికానే…

వాస్తవానికి మంచిర్యాల జిల్లా ఆవిర్భావం నుంచి కలెక్టర్‌గా కర్ణన్ కొనసాగుతున్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్‌గానూ విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసినా.. కర్ణన్ మాత్రం ఇక్కడే ఉన్నారు. మొన్నటి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గానూ పనిచేశారు. మంచిర్యాల వచ్చి రెండున్నరేళ్లు కావడంతో కర్ణన్ బదిలీపై ఎప్పటి నుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఏ సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించుకోవడంతో కర్ణన్ బదిలీపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే సోషల్ మీడియా ఔత్సాహికులు మాత్రం కర్ణన్‌ను బదిలీ చేసి.. దీపికను తెచ్చిపెట్టారు.

‘మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా దీపికా పదుకొనె బాధ్యతలు తీసుకోబోతోంది ఈ ప్రచారం ఏ రేంజ్‌ వరకు వెళ్లిందంటే.. మారుమూల ఊర్లలో కూడా ఈ విషయమే మాట్లాడుకున్నారు. దీపిక యాక్టర్ కదా..? ఎప్పుడు చదివింది..? ఎప్పుడు ఐఏఎస్ అయింది..? ఇదే డౌట్ చాలామందికి వచ్చి.. గూగుల్లో  సెర్చ్ చేశారు. ఎవరీ దీపిక..? ఆమె ఊరేంటి..? అమ్మ, నాన్న పేరేంటి..? ఇలా దీపిక గురించి ఆరా తీశారు. ఇది ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టిపారేసినా.. ప్రచారం మాత్రం ఆగలేదు. ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. వారం రోజుల వరకు ఫేస్‌బుక్, వాట్సప్ ఓ రేంజ్‌లో మోతమోగిపోయింది. ఈ రూమర్ కాస్తా కలెక్టర్ వరకు వెళ్లింది. కొందరైతే.. మీకు ట్రాన్స్‌ఫర్ అయిందంటగా అని కూడా అడిగేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని, ఈ పుకార్లు పుట్టించింది ఎవరో గుర్తించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

Deepika Padukone

ఇంతకీ కర్ణన్‌ను ఎక్కడికి బదిలీ చేశారంటే.. రాష్ట్ర గిరిజన శాఖ కమీషనర్‌గా పోస్టింగ్ ఇచ్చేశారు సోషల్ మీడియా ఫేక్ ప్రచారకర్తలు. మొదట్లో ఆయన గిరిజన ప్రాంతాల్లో పనిచేయడంతో ఈ వార్త నిజమే అనుకున్నారంతా. దీంతో కర్ణన్ బదిలీ ఖాయం.. దీపిక రావడం కూడా ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యారు.

Comments

comments

Share this post

scroll to top