ఐపీఎల్ వేలంపాటలో…అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆసక్తికర విషయాలు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్‌ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు.

ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్‌ టేబుల్‌ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్‌ను రైజ్‌ చేయడంలో ఆకాశ్‌ ముందంజలో కనిపించాడు.

ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్‌ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్‌ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్‌ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్‌ క్రికెట్‌ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్‌ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది.

Comments

comments

Share this post

scroll to top