ఝాన్సీ కీ రాణి సీరియ‌ల్ లో న‌టించిన ఆ బాలిక ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా..? చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

మీకు ఉల్కా గుప్తా తెలుసా..? ఏంటీ.. ఆలోచిస్తున్నారా..? మీకు ఆమె ఎవ‌రో తెలియ‌డం లేదు క‌దా. అయితే మరో ప్ర‌శ్న‌… ఒక‌ప్పుడు టీవీల్లో పాపుల‌ర్ సీరియ‌ల్ అయిన ఝాన్సీ కీ రాణీ తెలుసు క‌దా. ఆ.. అదే.. గుర్తొచ్చింది కదా. అందులో బాల్యంలో ఉన్న ఝాన్సీ రాణీ క్యారెక్ట‌ర్ వేసిన బాలిక గుర్తుంది కదా. అవును, ఆమే… ఇప్పుడు ఆమె గురించే మేం చెప్ప‌బోయేది. ఆమె పేరు ఉల్కా గుప్తా..! అవునా.. అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే.. ఒక‌ప్పుడు ఈమె టీవీ సీరియ‌ల్స్‌లో ఎక్కువ‌గా యాక్ట్ చేసింది. కానీ ఇప్పుడు యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చింది క‌దా. త‌న‌ను తాను పూర్తిగా మార్చుకుంది. బాలీవుడ్‌లో అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది.

ఉల్కా గుప్తా స‌హ‌జంగానే న‌ల్ల‌గా ఉంటుంది. దీంతో ఆమె బాలిక‌గా ఉన్న‌ప్పుడు న‌టిగా అవ‌కాశాలు రాలేదు. కానీ అనుకోకుండా ఝాన్సీ కీ రాణీ సీరియ‌ల్ లో బాల్యంలో ఉన్న ఝాన్సీ రాణీ పాత్ర కోసం ఆమె ఎంపికైంది. ఇక త‌రువాత ఆమెకు ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌చ్చాయి. స‌లోనీ కీ బేటీ, రేష‌మ్ దాన్‌ వంటి అనేక పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్స్‌లో ఉల్కా గుప్తా న‌టించింది. అలా త‌న 10వ ఏటి నుంచి న‌ట‌న‌లో రాణిస్తూ వ‌చ్చింది. ఇప్పుడు యుక్త వ‌య‌స్సుకు చేరుకుంది.

ఇప్పుడు కూడా ఉల్కా గుప్తా శ‌క్తి పీఠ్ భైర‌వ్ అనే సీరియ‌ల్‌లో న‌టిస్తోంది. అయితే ఒక‌ప్ప‌టిలా కాకుండా ఇప్పుడు ఉల్కా గుప్తా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమెను చూస్తే నిజంగా ఎవ‌రూ గుర్తు పట్ట‌లేరు. అంతలా ఈమె త‌న‌ను తాను మార్చుకుని గ్లామ‌ర‌స్‌గా త‌యారైంది. అయితే ఈమె త్వ‌ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ తీయ‌బోయే స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 అనే సినిమాలో న‌టిస్తున్న‌ట్టు పుకార్లు వ‌చ్చాయి. దీంతో ఉల్కా గుప్తా స్పందిస్తూ.. ఆ వార్త‌ల్లో నిజం లేదని, తాను ఇప్ప‌టికీ బాలీవుడ్‌లో మంచి అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాన‌ని తెలియ‌జేసింది. మ‌రి.. ఆమె బాలీవుడ్ ఫ్యూచ‌ర్‌కు మ‌నం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా..!

Comments

comments

Share this post

scroll to top