సినిమా అవకాశం ఇచ్చి చివరికి ఆ డైరెక్టర్ “ఝాన్సీ” ని ఏమన్నారో తెలుసా..? గొడవ ఏంటి అంటే..?

ఆర్ .నారాయణ మూర్తి హీరోగా,దర్శకుడిగా,నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.సామాజిక అంశాల నేపధ్యంలో సినిమాలు తీస్తూ ఇన్నేళ్ల తన కెరీర్లో  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్న పంథాలోనే సినిమాలు తీస్తూ పోయిన వ్యక్తి..తనతో ఎవరికైనా గొడవలుంటాయా అంటే ఉండవు అనే సమాధానమే వస్తుంది..అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఝాన్సీ ,ఆర్ .నారాయణ మూర్తితో తనకు గొడవైందని చెప్పుకొచ్చింది..

ఝాన్సీ గురించి చెప్పుకోవాలంటే యాంకర్ గా,యాక్టర్ గా మనందరికి పరిచయమే..ఎక్కువగా కామెడికి, ఎంటర్టైన్మెంట్ కే ప్రాధాన్యం ఇచ్చేది ఝాన్సీ..ఆ తర్వాత కొన్ని సామాజిక అంశాలపై కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు.యాంకర్ ఝాన్సీ,ఆర్.నారాయణ మూర్తి ఇద్దరు భిన్న ధృవాల లాంటి వాళ్లు..వీరిద్దరికి ఎలా పరిచయం అయింది,అసలు గొడవెందుకు జరిగింది అనే డౌటొచ్చిందా…

నారాయణమూర్తి సినిమాలో అవకాశం ఇచ్చారట..కానీ కొన్ని కారణాల వలన సినిమా నుండి ఝాన్సీ వాకౌట్ చేశారు..ఆ సినిమా టైంలో ఝాన్సీ క్యారెక్టరే క్లైమాక్స్ లో చాలా పవర్ఫుల్ గా ఉండే క్యారెక్టర్ అట..కానీ క్లైమాక్స్ మార్చి ఆ సీన్లో శకుంతలను పెట్టి సీన్ తీసారట..ఎందుకు ఆ విధంగా చేశారు అని అడిగిన ఝాన్సీకి నారాయణమూర్తి చెప్పిన సమాధానం ..నాకు నీ ప్రవర్తన నచ్చలేదు..మీరు షూటింగ్ గ్యాప్ టైంలో జోకులేసుకుంటున్నారు.నా మీద జోకులేసుకుంటున్నారు అని సీరియస్ అయ్యారట..నా క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదని ఝాన్సీ ఆ సినిమా నుండి వాకౌట్ చేశారట…ఇంతకీ  ఆ గొడవకు సంభందించిన వివరాలు ఝాన్సి మాటల్లోనే చూడండి.

watch video here:

ఆర్. నారాయణ మూర్తి తో నా గొడవ ఏంటి అంటే ? – Jhansi || Dialogue…

ఆర్. నారాయణ మూర్తి తో నా గొడవ ఏంటి అంటే ? – Anchor JhansiFULL interview link – https://youtu.be/jhZjNMYN1IA#NarayaMurthy #Jhansi #AnchorJhansi #iDreamMedia #DialogueWithPremaFor More Exclusive Interviews Subscribe To Our Channel: http://bit.ly/IDreamNews

Posted by IDream Media Inc on Monday, 11 December 2017

Comments

comments

Share this post

scroll to top