బికాం ఫిజిక్స్ జలీల్ ఖాన్ గారు మరోసారి లైవ్ లో బుక్ అయ్యారు.! ఫేస్బుక్ లో వచ్చిన ఈ ట్రోల్ వీడియో చూసి నవ్వుకోండి!

బికాం లో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ గుర్తున్నారా..మర్చిపోయే మనిషా ఆయన??అంటారా..నిజమే లాస్ట్ ఇయర్ జలీల్ ఖాన్ గారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..కేవలం ఒకే ఒక్క మాట బి.కాంలో ఫిజిక్స్ చదివాననే మాట అతన్ని సోషల్ మీడియా సెలబ్రిటిని చేసింది.రాత్రికి రాత్రి స్టార్ అయిపోవడమే కాదు,అప్పటివరకు జలీల్ ఖాన్ అంటే తెలియని వారికి కూడా తానెవరో తెలిసిపోయింది.అంతలా పబ్లిసిటి రావడానికి కారణం ..అతను బికాంలో ఫిజిక్స్ చదవడమే..ఒక ఇంటర్వ్్యూలో ఆయన చెప్పిన  ఈసమాధానంతో ఎన్ని ట్రాల్స్ నడిచాయి..అది జరిగి ఏడాది అయిపోయినా ఇంకా జలీల్ ఖాన్ ని ఎవరూ మర్చిపోలేదు..అలాంటిది మరొక సారి పొరపాటుగా మారి మళ్లీ అందరిని నవ్వుల్లో ముంచెత్తారు మన ప్రియతమ మంత్రి జలీల్ ఖాన్ గారూ..

ఒక టీవి ఛానెల్ పెట్టిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతున్న దానికి మధ్యలో జలీల్ ఖాన్ గారే కాల్ చేసి తను చెప్పాలనుకున్నదిచెప్పారు..గుంటూరులోని రాజధాని శంకుస్థాపనకి మోడి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ కాళ్లకు మొక్కారు అని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తుంటే..జలీల్ ఖాన్ గారు తనే స్వయంగా కాల్ చేసి మోడి గారి కాళ్లపై చంద్రబాబు నాయుడు  నవధాన్యాలు వేశారు అని చెప్పారు.అయితే ఇక్కడ నవధాన్యాలు అని చెప్పకుండా నవరత్నాలు చల్లారు అని అన్నారు..అంతే దాంతో ప్రోగ్రామ్ లో వచ్చే యాంకర్ కి,అక్కడున్న వక్తలకే కాదు టివి చూసేవారికి నవ్వు ఆగలేదు..జలీల్ ఖాన్ గారి మాటలు మీరూ ఒకసారి వినండి.

https://www.facebook.com/ManamThopuluEhe/videos/1327227777421106/

Comments

comments

Share this post

scroll to top