జాతి జాగృతం కొరకు ఓ వీడియో!…. IAS గారు మీకు సలాం!!

ఆయన పేరు సమిత్ శర్మ, ఆయనో IAS.. రాజస్థాన్ లోని మెడికల్ కార్పోరేషన్ కు MD గా వ్యవహరించే వారు. బ్రాండింగ్ పేరుతో  ఔషద సంస్థలు  తమ ఉత్పత్తులను పేదవాళ్ళ స్థొమతకు  అందనంత దూరంలో పెడితే,  జనరిక్ మెడిసిన్స్ అంటూ పేద వారికి తక్కువ రేటులో మందులు అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.  ఈ వీడియో చూడండి. మీకు ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది.

Watch Video: ( Wait Few Seconds For Video To Load):

ఇలా చేస్తే దేశ తలరాతే మారుతుంది.

Posted by Chantigadu on Tuesday, October 6, 2015

 

అసలు జనరిక్  మెడిసిన్  అంటే ఏమిటి:

బేసిక్ ఫార్ములా  ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.
జనరిక్ మందులు సామాన్యునికి ఇంకా దూరంగానే ఉన్నాయి. శాస్త్రీయంగా ధ్రువీకరించినా ఫలితం లేకుండా పోయింది. పేటెంట్ హక్కులిచ్చినా పట్టించు కునే వారు కరవయ్యారు. పేదల పెన్నిధిగా ప్రచారం చేసిన ఈ ఔషధ విక్రయ కేంద్రాలు కనుచూపు మేరలో పేదలకు అందుబాటులో వచ్చే విధంగా లేవు. వాటిపై అన్ని ప్రాంతాల్లో దృష్టి సారిస్తే… పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top