సినిమాల మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన లక్ష్మీనారాయణ.

తెలుగు  రాష్ట్రాలపై తనదైన ముద్ర వేసిన లక్ష్మీనారాయణ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సినిమా పాటలు  ఎక్సైర్‌సైజ్‌లు చేసేందుకు మాత్రమే పనికొస్తాయని ఆయన విమర్శించారు. సినిమాల ప్రభావం పిల్లల మీద విపరీతంగా ఉందని  దాని వల్ల వారి భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, కావున తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని లక్ష్మీనారాయణ అన్నారు. నేటి సినిమాల్లో త్యాగమూర్తుల గురించి ఎక్కడా కననపడటం లేదని, సినిమాలన్నీ సంస్కృతికి దూరంగా వెళ్తున్నాయని లక్ష్మినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రాచలంలోనిర్వహించిన జాతీయస్థాయి భద్రాద్రి బాలోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ ముంబై  పోలీస్ జాయింట్ కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  ఈ సంధర్భంగా ఈయన రెండు పాటల చరణాలు కూడా పాడి పిల్లలకు వినిపించారు.

JD Laxmi Narayana Excellent Speech:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top