ఐశ్వర్య జస్బా ట్రైలర్ విడుదల. లాయర్ గా ఐస్.

దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ అందాలనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్  వెండితెర మీద కనబడబోతున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఇర్పాన్ ఖాన్, ఐస్ లు ప్రధాన పాత్రలలో అక్టోబర్ 9 న విడుదల కానున్న చిత్రం జస్బా. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ఉండొచ్చు. లాయర్ పాత్రలో ఐశ్వర్య, ఇన్స్ ఫెక్టర్ పాత్రలో ఇర్పాన్ ఖాన్ లు  నటించారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి ష‌బ‌నా ఆజ్మీ కూడా  ఓ ప్ర‌ధాన పాత్రలో క‌నిపించ‌నున్నారు.

చాలా కాలంగా కూతురు ఆరాధ్య  ఆలనా, పాలన తోనే ఐశ్వర్య గడుపుతూ వచ్చారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయ్.

Watch   Jazba Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top