ఇటీవలే సహజ నటి “జయసుధ” గారి భర్త “నితిన్ కపూర్” ఆత్మహత్య చేసుకొని మరణించారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్, ఆ ఇంటినే తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో….. మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్కపూర్ ఈ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు…ఈ విషయాన్ని ముంబాయి పోలీసులు ధృవీకరించారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెలువడనప్పటికీ…సోషల్ మీడియాలో మాత్రం “జయసుధ” మొదటి భర్తకు సంబందించిన వార్త ట్రెండ్ అవుతుంది. 1985 లో “నితిన్ కపూర్” గారితో “జయసుధ” వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కానీ “నితిన్ కపూర్” కంటే ముందు “జయసుధ” మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి దగ్గరుండి జరిపించింది “దాసరి నారాయణరావు” గారు. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారా?
“విజయవాడ” లో “వడ్డె రమేష్ (నిర్మాత)” గారితో “జయసుధ” గారికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి పెద్దగా “దాసరి నారాయణరావు” గారు వహించారు. కానీ అనుకోకుండా వారిద్దరూ విడిపోయారు. ఆ తరవాత “జయసుధ” నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ “వడ్డె రమేష్” ఎవరా అనుకుంటున్నారా? ఒకప్పుడు హీరో గా ఒక మోస్తరు పేరు సంపాదించుకున్న “వడ్డె నవీన్” తండ్రి.