జయలలిత నటించిన ఫస్ట్ సినిమా A సర్టిఫికేట్ సినిమా.!వయస్సు సరిపోని కారణంగా ఆమె సినిమాను ఆమే చూడలేకపోయింది!?

జయలలిత మరణం తర్వాత….ఆమె గురించిన ఆసక్తికర విషయాలు, తెలియని విషయాలు ఒక్కోక్కటిగా  బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అందులో అత్యంత్య ఆసక్తికరమైనది జయలలిత నటించిన మొదటి సినిమా ” వెన్నీరఅడై” గురించి….వెన్నీర అడై అంటే…తెలుగులో….తెల్లని దుస్తువులు  అని అర్థం.  ఈ సినిమాలో జయలలిత… యుక్త వయస్సులోనే ఓ యాక్సిడెంట్ లో భర్తను కోల్పోయి విధవగా మారి..డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన  శోభ అనే  క్యారెక్టర్ ను చేసింది. అయితే జయలలిత నటించిన తన మొదటి సినిమా అయిన వెన్నీరఅడై ను మాత్రం థియేటర్ లో చూడలేకపోయిందట.! ఎందుకంటే…..సెన్సార్ బోర్ట్ ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చిందట…. ఆ సినిమా విడుదల నాటికి జయ వయస్సు 17 సంవత్సరాలే….A సర్టిఫికేట్ సినిమా చూసేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు కావడంతో…జయలలిత తన మొదటి సినిమాను థియేటర్లో చూడలేకపోయారట! కానీ ఆ సినిమానే జయలలిత ను ఓవర్ నైట్ లో పెద్ద స్టార్ ను చేసిపడేసింది. ముఖ్యంగా కుర్రాకారులో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది. టెన్త్ క్లాస్ లో స్టేట్ టాపర్ అయిన జయలలిత…. లాయర్ కావలనుకున్నారట, కానీ జయలలిత అమ్మ ఒత్తిడి మేరకు సినీరంగం వైపు వచ్చారు.

Watch Jayalalitha Song:

Comments

comments

Share this post

scroll to top