గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలో ఉన్నది జయలలిత సొంతకూతురంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. జయ మరణం తర్వాత ఈ ఫోటో మరింతగా వైరల్ అయ్యింది. Ph.D దాకా చదివిన ఈమె ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డదంటూ పుకార్లు కూడా పుట్టించారు నెటీజన్లు. చూడడానికి జయలలిత లాగున్న ఈ ఫోటోను చూసి చాలా మంది నమ్మేశారు. ఇక మరికొందరైతే…ఇది జయలలిత యంగ్ ఏజ్ లో ఉన్న ఫోటో అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అయితే ఈ ఫోటో అసలు వాస్తవాన్ని బయటపెట్టింది ప్రముఖ గాయని శ్రీపాద చిన్మయి. తన ఫేస్ బుక్ లో….ఈ ఫోటో మీద వివరణ ఇస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నామె పేరు దివ్యా రామనాథన్, వీరిది మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలజీ కుటుంబానికి చెందినవారు. ఆమెకు తమిళనాడు రాజకీయాలతోగానీ, జయలలితతోగానీ ఏవిధమైన సంబంధం లేదని’ స్పష్టం చేసింది చిన్మయి…. దివ్యారామనాథన్ ఆమె భర్త కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.
చిన్మయి పోస్టింగ్ పై …దివ్యా రామనాథన్ మరిది త్రివేండ్ర బాలాజీ స్పందిస్తూ….. ‘అవును ఇది మా సోదరుడు..ఆమె భార్య ఫొటో’ అంటూ ధృవీకరించారు. మొదటి ఫోటో 2008లో నా పెళ్లి సంధర్భంగా దిగినది, రెండవది ఇటీవల కాలంలో దిగినదని వివరణ కూడా ఇచ్చారు త్రివేండ్ర.