జయలలిత వదిలి వెళ్లిన ఆస్తుల మొత్తం ఎంత? వాటికి వారసులెవరు??

జయలలిత మరణం తర్వాత….ఆమె కూడబెట్టిన ఆస్తులపై ఇప్పుడు అందరూ దృష్టి సారించారు.దానికోసం ఆమె ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో కొన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిని సైతం కోల్పోవాల్సి రావడం, వారసులు కూడా లేకపోవడంతో…అసలు జయ కూడబెట్టిన డబ్బు మొత్తం ఎంత? ఇది ఎవరికి దక్కుతుంది? అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జయ ఆస్తులు వివరాలు:

RK నగర్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు జయలలిత 2015 జూన్ వరకు తనకు రూ. 113.73 కోట్ల ఆస్తులున్నట్టు ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో 72.09 కోట్లు స్థిరాస్తులు కాగా….41.63 చరాస్తులు.

amma-1

జయలలిత నివాస గృహం వేద విలాస్:
జయలలిత తల్లి సంధ్య 1967లో 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ఇంటి వాల్యూ ఇప్పుడు 43.96 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఇళ్లు ఇప్పుడు జయలలిత స్నేహితులరాలు శశికళకు దక్కుతుందంట.!

vedanilayam

వ్యవసాయ భూమి:
1968లో తల్లి సంధ్యతో కలిసి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో కొనుగోలు చేసిన 14.50 ఎకరాలు(దీని విలువ 14 కోట్లకు పైనే ఉంటుంది) ,తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు.

షాపింగ్ కాంప్లెక్స్:
తమిళనాడు లో రెండు, హైద్రాబాద్ లో ఒకటి కలుపుకొని మొత్తం జయలలితకు 4 షాపింగ్ కాంప్లెక్స్ లున్నాయి….ఇందులో ఒక షాపింగ్ కాంప్లెక్స్…శశికల అన్న కుమారుడు VN సుధాకర్ కు దక్కనుంది.

All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) leader J. Jayalalithaa waves to her party supporters while standing on the balcony of her residence in Chennai on May 13, 2011,

కార్లు…
రెండు టయోటా ప్రాడో SUVలు , టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42,25,000.

vehicles

బంగారం, వెండి ఆభరణాలు:
జయలలితకు సంబంధించిన సుమారు 21Kgల బంగారు ఆభరణాలు ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.వీటితో పాటు .3 కోట్లకు పైగా విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉంది. ఇవి ఎవరి దక్కాలి అన్నదాని పై క్లారిటీ లేదు.

పెట్టుబడులు:
సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. పార్టనర్గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి విలువ రూ.27.44 కోట్లు. ఇందులో తమిళనాడులోని ఓ ఛానల్ కూడా ఉంది.

టాక్స్:   2013-14 వరకు ఇన్ కమ్ టాక్స్ కట్టిన ఆమె, 2015-16 ఏడాదికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఆమె దాఖలు చేశారు.

ముఖ్యమంత్రి పదవి:  జయలలిత  4 సార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఆమె మరణాంతరం ఆమె స్థానం తన అనుంగు అనుచరుడు పన్నీర్ సెల్వం కు దక్కింది.

o-panneerselvam-with-j-jayalalithaa_650x400_81476860238

పార్టీ అధ్యక్ష పదవి: MJR తర్వాత  1989 నుండి 2016 వరకు…తమిళనాడులో All India Anna Dravida Munnetra Kazhagam పార్టీని  పతాకస్థాయిలో నిలబెట్టింది.  అలాంటి పార్టీని ఇప్పుడు జయ స్నేహితురాలు….శశికళ నడపనుంది.

p14

( ముఖ్యమంత్రిపదవి, పార్టీఅధ్యక్ష పదవి…..కూడబెట్టిన ఆస్తుల కిందికి రావు…గమనించగలరు)

Comments

comments

Share this post

scroll to top