జయహొ జయలక్ష్మి శిక్షణలో మేటి..!

ఇప్పుడంతా బిజీ లైఫ్. ఎవరిని కదిల్చినా ఏదో టెన్షన్ ..ఇంకేదో సాధించాలన్న ఉబలాటం. పోటీ ఎక్కువ. ఏం చేయాలో తెలీదు. ఎవరిని కాంటాక్ట్ చేయాలో సమాచారం ఉండదు. వేలకు వేలు తగలేసి ..అడ్డమైన కోర్సులన్నీ చదివేస్తే ..జాబ్స్ రాక ఇంటా బయటా తిట్లు. ఇవ్వన్నీ తట్టుకుని ఇంటర్యూ దాకా వెళితే మొదటికే మోసం . విపరీతమైన వత్తిడి ఎవ్వరికీ చెప్పుకోలేక ..ఎక్కడా బతకలేక నానా ఇబ్బందులు పడే వాళ్ళు ఈ మధ్య ఎక్కువై పోయారు.

సరైన గైడెన్స్ లేక అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల ముందు వాలి పోతున్నారు. ఇదంతా నేటి నయా జమానా కథ. ఎవ్వర్నీ కదిపినా అమెరికా పేరే . అది లేకపోతే ఇక లైఫ్ లేనట్టు గాబరా పడుతుంటారు. పీవీ సంస్కరణల పుణ్యమా అని ఎన్నో కంపెనీలు ఇండియాకు వచ్చాయి. అందులో ఎక్కువగా బెంగళూర్ , హైదరాబాద్ వాటిని ఆక్రమించాయి. గత 20 ఏళ్ళ నుండి ఐటీ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. దీంతో మన హైదరాబాద్ అనుకోని రీతిలో ఐటి హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది . దీంతో ఐఐటి , ఇంజనీరింగ్ కోర్సులకు భలే డిమాండ్ పెరిగింది . మిగతా రంగాలను దాటేసుకుంటూ ఐటి తన ఆధిపత్యాన్ని సాగిస్తూ వస్తోంది .సత్యం కంప్యూటర్స్ పుణ్యమా అంటూ తెలుగు వారి లోగిళ్ళు ఐటి కొలువులు చేసే వారితో నిండి పోయాయి . అంతా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల హవా కొనసాగింది. కొంత మేర ఐటి ఒడిదుడుకులకు లోనైనా మళ్ళీ పుంజుకుంది . ఐటి అంటేనే అమెరికా ..ఇప్పుడు ఇండియా , హైదరాబాద్ చేరుకుంది .

గూగుల్ , ఫేస్ బుక్ , మైక్రోసాఫ్ట్, పొలారిస్, విప్రో , టీసీఎస్ , ఇన్ఫోసిస్ , కాప్ జెమిని , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. అమీర్ పేట , కూకట్ పల్లి..మైత్రి వనం ప్రాంతాలు ఐటి కొలువులకు తయారు చేసే ట్రైనింగ్ కేంద్రాలకు అడ్డాలుగా పేరు పొందాయి . ఇలా ఐటి కంపెనీలే కాకుండా ఎన్నో కంపెనీలకు సెలెక్ట్ కావాలంటే చాలా కాస్త పడాల్సి ఉంటుంది . ఇలా కొన్ని వేళా మందికి జాబ్స్ దక్కించు కోవడంలో కీలక భూమిక పోషిస్తున్నారు జయ లక్ష్మి కొప్పిశెట్టి.

jayaho jayalakshmi

ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి .ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి .. ఎలా నడవడికను అలవరచు కోవాలి . ఎలాంటి సమాచారాన్ని తమ వద్ద ఉంచు కోవాలి . ఏం చేయాలి ..ఏం చేయకూడదో మేడం తీర్చి దిద్దుతారు . ఎన్నో మెట్లు ఎక్కి వచ్చాక ఆఖరు మెట్టు అయినా ఇంటర్వ్యూ ను సరిగా చేయలేక పోతే ..ఎన్నో ఆశలు పెట్టుకున్న జాబ్ రాకుండా పోతుంది . ఇంపాక్ట్ ద్వారా ఆమె ఎందరికో ట్రైనింగ్ ఇస్తున్నారు . ఏకంగా ఉద్యోగార్థుల్లో ఉన్న బెరుకును పోగొట్టటమే కాదు వారిని విజేతలుగా మారేలా కృషి చేస్తున్నారు .

ప్రస్తుతం దుబాయి లోని కీయారా కన్సల్టెన్సీ కంపెనీలో ఆమె సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు . కంమ్యూనికేషన్ , సాఫ్ట్ స్కిల్స్ తో పాటు సమయానికి అనుకూలంగా మలచుకోవడం , స్ట్రెస్ మేనేజ్మెంట్ , పరీక్షల్లో ఎలాంటి టెక్నీక్స్ వాడాలి , బేసిక్ స్కిల్స్ , దుస్తుల ఎంపిక మహిళలు , పురుషులకు ఎలాంటివి వేసుకోవాలో ఆమె చాలా సహజంగా చెబుతారు . ఇంటర్వ్యూ లో మన బాడీ లాంగ్వేజీ కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది అంటారు ఆమె .

పాజిటివ్ థింకింగ్ లో ఉన్న పవర్ ఏమిటో , టెలిఫోన్ ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలో , సమాధానాలు ఎలా చెప్పాలో తర్ఫీదు ఇస్తారు . టీమ్ వర్క్ లో ఉన్న మెళకువలు , కేరెక్టర్ , కెరీర్ ఎలా పెంచుకోవాలి దేనిని ఎప్పుడు వదిలి వేయాలో సవివరంగా బోధిస్తారు . అపారమైన అనుభవం .. పలు అంశాలపై పట్టు .. వెరసి ట్రైనింగ్ ఇవ్వడంలో ఆమె రాణిస్తున్నారు వ్యక్తుల్ని విజేతలుగా మలుస్తూనే ఆమె విలువలకు పెద్ద పీట వేస్తూ ..కంపెనీలకు ఆమె భరోసా కల్పిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వారికి అసలు సిసలైన వారిని ఎంపిక చేసే భాద్యతను ఆమెకు అప్పగిస్తున్నారు. మెరికెల్లాంటి వారిని ఎలా గుర్తించాలి ..వారిని ఎలా సంస్థలో భాగస్వామ్యం చేయాలి ..ఎలా చేస్తే అనుకున్న టార్గెట్స్ నిర్దేశిన టైం కంటే ముందుగా పూర్తి చెయ్యొచ్చో …ట్రైనర్ గా ఆమె సక్సెస్ అయ్యారు . రామకృష్ణ మఠం లో ట్రైనర్ గా ..కౌన్సిలర్ గా పనిచేశారు .

లైఫ్ ను డీల్ చేయాలంటే చాలా కష్టపడాలి . సెటిల్ కావాలంటే జాబ్ కావాలి . లేదా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి . ఎక్కడైనా బతకాలంటే కాసింత కామన్సెన్స్ తో పాటు లైఫ్ ..సాఫ్ట్ స్కిల్స్ అవసరమే . వీటన్నిటిని దాటుకుని సక్సెస్ ఫుల్ గా పేరు పొందాలంటే మాత్రం మేడం క్లాస్ వినాలి . వీలు కుదిరితే ఆమె ఇంపాక్ట్ లో ఇచ్చిన ట్రైనింగ్ చూడండి . మీరు మారి పోతారు ..అంతులేని సక్సెస్ స్వంతం చేసుకుంటారు .

Comments

comments

Share this post

scroll to top