జయలలిత పై వార్ కు ఖుష్బూ రెడీ !!!

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణ తో కోర్టులు, కేసుల చుట్టూ తిరిగిన జయలలితకు నెల క్రిందటే ఊరట లభించింది. ఇదే విషయమై తమిళనాడు సిఎం స్థానాన్ని రాజీనామ చేసి  తన విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం  సిఎం సీటును  అప్పజెప్పిన జయ, కర్నాటక కోర్టు తన మీదున్నటువంటి కేసును కొట్టివేయడంతో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

JAYA

జైలు  జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే అధ్యక్షురాలు.. ఆర్కేనగర్ స్థానం అసెంబ్లీ బరిలో దిగనున్నారు. ఈ స్థానానికి జూన్ 27న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ కూడా ప్రకటించింది. అసలు స్టోరి ఇక్కడే స్టార్ట్ అయ్యింది..  పురచ్చి తలైవి మీద పోటికి దిగి గెలవగలిగే వారెవ్వరూ లేరని అన్ని పార్టీలకు క్లియర్ గా తెలుసు . అయినప్పటికీ కాంగ్రెస్ తరపున జయలలితపై పోటీ చేసేందుకు ప్రముఖ తమిళనటి ఖుష్బూ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

khushbu_Congress650

 

మొదట్లో బీజేపీలో ఉన్న ఖుష్భూ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయ పై పోటీ ద్వారా తన ప్రత్యక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట..  గెలుపు సంగతి పక్కన పెడితే కాస్తంత ప్రచారం అయినా కలగకపోదా అన్న ధీమా తో ఉన్నారట.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top