వరదసాయం సరిగ్గా అందిచలేదన్నందుకు…. పరువునష్టం దావా వేసిన జయలలిత ప్రభుత్వం!?

జయలలిత. తమిళనాడు ప్రజలచే అమ్మగా పిలవబడుతూ, తమిళనాడు రాజకీయాలలో ముఖ్యమంత్రిగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న నేత. జయలలిత పరిపాలనను గొప్పగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అంతేమంది రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారనేది వాస్తవం. నిన్నటివరకూ ఆమె టార్గెట్ తమిళనాడులోని తమిళ్ మ్యాగజైన్ కు చెందిన ఆనంద్ వికటన్, డిఎంకే నేత కరుణానిదులే కాగా, తాజాగా ఆమె లిస్ట్ లోకి ట్రాఫిక్ రామస్వామి చేరాడు. సామాజిక మాధ్యమాలలో చురుక్కుగ్గా ఉండే రామస్వామి, రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు వరద సహాయం బాగా అందించలేదంటూ, వారిని పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే తనపై ఇలా నెగటివ్ గా ప్రచారం చేస్తూ, తన పాలనను చులకనగా చేస్తున్నాడని పబ్లిక్ ప్రాసిక్యుటర్  ఎం.ఎల్. జగన్ కోర్టులో రామస్వామిపై పరువునష్టం దావా కేసు వేశాడు.

traffic_ramasamy_0

ఆ కేసులో రామస్వామిపై పరువునష్టం, కుంభకోణం, తక్కువ చేస్తూ కించపరచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని అతడిపై కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇటువంటి కేసులు తమిళనాడు జయలలిత పరువునష్టందావా, కించపరచేలా,రెచ్చగొట్టే  మాటలు మాట్లాడుతున్నరాని, తన గురించి, తన ప్రభుత్వం గురించి చేదుగా ప్రచారం చేస్తున్నారని 2015 జూలై వరకు మొత్తం 112 కేసులు కోర్టులో తన రాజకీయ ప్రత్యర్థులు, మ్యాగజైన్ ఎడిటర్స్, మరికొందరి నేతలపై పరువునష్టం కేసులు ఫైల్ చేసింది.
గతనెల నవంబర్ 24న తన ప్రభుత్వ పాలన గురించి తమిళ్ మ్యాగజైన్ ఎడిటర్ ఆనంద్ వికటన్, కరుణానిధి తప్పుగా ప్రచారం చేస్తూ, ఆ మ్యాగజైన్ లో కించపరచేలా ఉన్నాయని వారిద్దరిపై పరువునష్టం దావా మరియు క్రిమినల్ కేసులను కోర్టులో నమోదు చేసింది. ఆ మ్యాగజైన్ లో ‘మంత్రి-తంత్రి’ అని రాసిన ఎడిటర్ ఆర్. కన్నన్ మరియు ప్రింటర్ మాధవన్ లపై పరువునష్టం కేసులు నమోదు చేసింది.
ఇక అంతకుముందు నవంబర్ 21 న డిఎంకే నేత కరుణానిధి కనుసైగల్లో నడుస్తున్న మురసోలి అనే పత్రిక, జయలలిత 4 ఏళ్ళ పరిపాలన గురించి, కించపరచేలా రాయడంతో అది పబ్లిష్ చేసిన ప్రింటర్ మరియు ఆ పత్రిక ఎడిటర్ ఎస్. సెల్వం, కరుణానిదిలపై పరువునష్టo దావా కేసు నమోదుచేసింది. అలాగే జూలైలో తమిళ మ్యాగజైన్ నక్కీరన్ మరియు ఆన్ లైన్ వెబ్ సైట్ అయిన రెడిఫ్. కామ్ తన ఆరోగ్యం గురించి లేనిపోని కల్పిస్తూ ప్రచురించారని, వారిపై పరువునష్టం కేసు వేసింది. అలాగే సుబ్రమణ్య స్వామి తనపై హానికరమైన ట్వీట్స్ చేశాడని పరువునష్టం దావా వేసింది.

Comments

comments

Share this post

scroll to top