వేలిముద్రల ఆధారంగా జాండిస్ ను గుర్తించే మెషీన్ కనిపెట్టిన శ్రేష్ట.!

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం..మన శరీరంలో కర్మాగారంలా పనిచేసే కాలేయం విధులు తక్కువేం కాదు…దానికి వచ్చే వ్యాధుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు..వాటిల్లో పచ్చ కామెర్లు ఒకటి…ఒకసారి కామెర్లు అటాక్ చేసాయంటే గుర్తు పట్టడం కష్టం..చాలా కొద్ది మందిలో మాత్రమే ముందుగా గుర్తిస్తే..ఎక్కువ మందిలో అవి ముదిరేంత వరకు తెలియవు… కామెర్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే రక్త, మూత్ర పరీక్షలు చేయాలి. ….కానీ వేలిముద్రల ద్వారా కామెర్లు గుర్తించే మెషిన్ ని తయారు చేసింది….శ్రేష్ట బసు..

శ్రేష్ట బసు ..గౌహతీ ఐఐటీ లో చదువుతుంది… కామెర్లు వచ్చిన ఎంతోమంది వాటిని గుర్తించలేక..గుర్తించిన సరైన సమయంలో పరీక్షలు చేయించుకోలేక ప్రాణాలు కోల్పోవడం తెలుసుకుని చలించిపోయింది .కామెర్లను గుర్తించాలంటే రక్తంలో బైలురిబిన్ విలువలను గుర్తించడం కోసం రక్తం ,మూత్రం పరీక్షలు చేయించుకోవాలి..అదంతా పెద్ద ప్రాసెస్..అలాకాకుండా వేలిముద్రల ఆధారంగా కామెర్ల పరీక్షలు చేసే మెషీన్ ని తయారు చేసింది. బొటన వేలు పరీక్షల అనంతరం రక్తంలో పసుపు రంగు శాతం ఎక్కువ ఉంటే పచ్చకామెర్లుగా నిర్ధారించవచ్చు. వైద్య చరిత్రలో ఇలాంటి ఆవిష్కరణ ఇప్పటివరకు రాలేదు..అందులోనూ ఒక స్టూడెంట్ చదువుతున్న రోజుల్లోనే చేయడం విశేషం. ప్రొఫెసర్ అరుణ్ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేసింది శ్రేష్ట. శ్రేష్ట కనిపెట్టిన ఈ మెషీన్ అందుబాటులోకి వస్తే కామెర్లను గుర్తించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు..

భవిష్యత్ లో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తనవంతుగా వైధ్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేస్తా అంటుంది శ్రేష్ట… హ్యాట్సాప్ టు హెర్..

Comments

comments

Share this post

scroll to top